పర్యాటక రంగం.. 50 బిలియన్‌ డాలర్లు

India Is tourism should target 50 billion dollar revenues by 2022 - Sakshi

2022 నాటికి లక్ష్యం: అమితాబ్‌కాంత్‌

న్యూఢిల్లీ: పర్యాటక రంగం 2022 నాటికి 50 బిలియన్‌ డాలర్ల (రూ.3.55 లక్షల కోట్లు) ఆదాయ లక్ష్యాన్ని సాధించాలని నీతి ఆయోగ్‌ అమితాబ్‌ కాంత్‌ సూచించారు. ఈ రంగానికి వృద్ధి అవకాశాలు, ఉపాధి కల్పన అవకాశాలు అపారంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. సీఐఐ 15వ వార్షిక పర్యాటక సదస్సు ఢిల్లీలో గురువారం జరిగింది. దీనికి కాంత్‌ హాజరై మాట్లాడారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీ ఉపాధి అవకాశాలు కల్పించే సామర్థ్యం పర్యాటకానికి ఉందన్నారు. ‘‘2018లో భారత పర్యాటక రంగం 28.6 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. దీన్ని 2022 నాటికి 50 బిలియన్‌ డాలర్లకు తీసుకెళ్లే లక్ష్యాన్ని పెట్టుకోవాలి’’అని ఆయన పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top