పెరిగిన క్యాన్సర్‌ పాలసీల అమ్మకాలు

Increased Cancer Policies Sales - Sakshi

హైదరాబాద్‌: క్యాన్సర్‌ పాలసీల అమ్మకాలు గణనీయంగా పెరిగాయని, తాము ఇప్పటివరకు 1.25 లక్షల పాలసీలను విక్రయించినట్లు ఎల్‌ఐసీ సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ జోనల్‌ మేనేజర్‌ వీ సతీష్‌ కుమార్‌ వెల్లడించారు. జీవన్‌ ఆరోగ్య, క్యాన్సర్‌ పాలసీలకు డిమాండ్‌ పెరిగిందని తెలిపారు. ఒక తాజా అధ్యయనం ప్రకారం భారత్‌లో 25 లక్షల మంది క్యాన్సర్‌ బారిన పడినట్లు తేలిందని ఇక్కడ ఏర్పాటుచేసిన సమావేశంలో పేర్కొన్నారు. క్యాన్సర్‌ చికిత్సకు రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు వ్యయం అవుతుండగా... ఎల్‌ఐసీ రూ.50 లక్షల వరకు పాలసీని అందిస్తున్నట్లు తెలిపారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top