ప్రపంచ ఆర్థిక రిస్క్ లు పెరిగాయ్ | IMF warns of fresh financial crisis | Sakshi
Sakshi News home page

ప్రపంచ ఆర్థిక రిస్క్ లు పెరిగాయ్

Apr 14 2016 12:58 AM | Updated on Sep 3 2017 9:51 PM

ప్రపంచ ఆర్థిక రిస్క్ లు పెరిగాయ్

ప్రపంచ ఆర్థిక రిస్క్ లు పెరిగాయ్

ప్రపంచ ఆర్థిక రిస్క్‌లు పెరిగాయని, దీనిని ఎదుర్కొనడానికి అన్ని దేశాలూ సమన్వయంగా పటిష్ట విధాన నిర్ణయాలు

♦ ఐఎంఎఫ్ నివేదిక హెచ్చరిక
♦ సమగ్ర, పటిష్ట, సమన్వయ  విధాన చర్యలకు సూచన

 వాషింగ్టన్: ప్రపంచ ఆర్థిక రిస్క్‌లు పెరిగాయని, దీనిని ఎదుర్కొనడానికి అన్ని దేశాలూ సమన్వయంగా పటిష్ట విధాన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) పేర్కొంది. ఈ మేరకు తాజా ప్రపంచ ఫైనాన్షియల్ స్టెబిలిటీ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం...

♦ కమోడిటీ ధరల పతనం, చైనా మందగమనం వంటివి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.

♦ అనిశ్చితిని సమన్వయంతో ఎదుర్కొనలేకపోతే.. వర్థమాన దేశాల ఆర్థిక వ్యవస్థలపై ఇది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. రానున్న ఐదేళ్లలో ఒక ఏడాదికి సమానమైన వృద్ధి హరించుకుపోయే ప్రమాదం ఉంది.

♦ అయితే సమన్వయంగా పరిస్థితిని ఎదుర్కొనగలిగితే... 2% అదనపు వృద్ధీ సాధ్యమవుతుంది.

♦ ఈక్విటీల్లో తీవ్ర ఒడిదుడుకులకు విశ్వాసం పటిష్టంగా లేకపోవడమే ఒక కారణం.

♦ వృద్ధి విషయంలో ద్రవ్య పరమైన విధానాలకు కీలకం అయినప్పటికీ, కేవలం వీటిద్వారానే సమస్య పరిష్కారం అయిపోతుందని భావించరాదు.  వృద్ధికి దోహదపడే పటిష్ట సంస్కరణలు, తగిన సమన్వయ ద్రవ్య విధానాలు అవసరం. ఆయా అంశాల వల్ల ప్రతికూలతలను తట్టుకుని నిలబడేలా చేస్తుంది.

♦ అంతర్జాతీయ స్థాయిలో ఫైనాన్షియల్ రెగ్యులేటరీ సంస్కరణల ఎజెండా పూర్తికావాలి.

♦ కమోడిటీ ధరల తగ్గుదల, పలు దేశాల్లో ద్రవ్యపరమైన ఇబ్బందులు ప్రపంచ వృద్ధి అంచనాలను  బలహీనంగా మార్చుతున్నాయి.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement