కరోనా: ఐసీఐసీఐ గ్రూప్‌ 100 కోట్ల విరాళం

ICICI Group commits Rs 100 crore for COVID19 relief - Sakshi

సాక్షి, ముంబై : కోవిడ్-19 మహమ్మారి కట్టడికి జరుగుతున్న పోరులో ఐసీఐసీఐ గ్రూప్‌ దేశానికి మద్దతుగా నిలిచింది. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్‌ బ్యాంక్ ద్వారా సేవలందిస్తున్న ఐసీఐసీఐ గ్రూపు వంద కోట్ల రూపాయల విరాళాన్ని  మంగళవారం ప్రకటించింది. ఇందులో రూ.80 కోట్లు పీఎంకేర్స్‌కు, రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ సంస్థలకు రూ.20 కోట్లు అందించనున్నామని ఐసీఐసీఐ బ్యాంక్‌ ప్రెసిడెంట్‌ సందీప్‌ బాత్రా ప్రకటించారు.  

కరోనా వైరస్ దేశ ప్రజలపై గట్టి సవాల్ విసిరింది.(కరోనా వ్యాక్సిన్ : రెండో దశ క్లినికల్ ట్రయల్స్) ఈ సమయంలో అందరం కలసి కట్టుగా నిలబడి పోరాటాలని కోరుతున్నామని బాత్రా తెలిపారు. ఇందులో భాగంగానే  కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో భాగంగా తాము ఈ విరాళాన్ని అందిస్తున్నామని ఆయన చెప్పారు. కోవిడ్ -19 వ్యాధిని ఎదుర్కొనేందుకు  ఇప్పటికే 2.13 లక్షల సర్జికల్‌ మాస్కులు, 40వేలకు పైగా ఎన్‌95 మాస్కులు, 20వేల లీటర్ల శానిటైజర్లు, 16వేల గ్లౌజ్‌లు, 5300 వ్యక్తిగత రక్షణ సూట్లు (పీపీఈ), 2600 ప్రొటెక్టివ్‌ ఐ గేర్‌, 50 థర్మల్‌ స్కానర్లు, వెంటీలేటర్లను వివిధ ఆసుపత్రులకు, రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు అందించామని చెప్పారు.  ఈ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటంలో ముందంజలో ఉన్న ప్రజలకు తమ సేవలను కొనసాగిస్తామని వెల్లడించారు. (పేదల ఊసే లేదు, రాష్ట్రాలకు సాయం లేదు)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top