స్థానిక భాషలో వాట్సాప్‌ వాడటమెలా?

How To Use WhatsApp In Your Local Language - Sakshi

గత కొన్నేళ్లుగా కమ్యూనికేషన్‌ మాధ్యమంగా వాట్సాప్‌ ఎంతో ప్రాచుర్యం పొందింది. 200 మిలియన్‌ మంది యాక్టివ్‌ యూజర్లతో భారత్‌లో ఫేస్‌బుక్‌ తనదైన సత్తా చాటుతోంది.  ప్రస్తుతం మీ ఫేవరెట్‌ ఈ యాప్‌ 10 స్థానిక భాషలను సపోర్టు చేస్తోందని తెలిసింది. హిందీ, మలయాళం, బెంగాళీ, పంజాబి, తెలుగు, మరాఠి, తమిళ్‌, ఉర్దూ, గుజరాతి, కన్నడ భాషలను ఇది సపోర్టు చేస్తోంది. 

అయితే స్థానిక భాషల్లో వాట్సాప్‌ వాడటం ఎలానో చూడండి...
తొలుత యాప్‌లో మీ భాషను మార్చుకోవాల్సి ఉంటుంది. దీని కోసం 

  • వాట్సాప్‌ ఓపెన్‌ చేయాలి
  • మెనూ బటన్‌ను ట్యాప్‌ చేయాలి
  • సెట్టింగ్స్‌కు వెళ్లాలి
  • ఛాట్‌కి వెళ్లి, అనంతరం యాప్‌ లాంగ్వేజ్‌ను ఓపెన్‌ చేయాలి
  • పాప్‌ నుంచి మీకు నచ్చిన లాంగ్వేజ్‌ను ఎంపిక చేసుకోవాలి
  • మీ ఫోన్‌ సామర్థ్యం బట్టి, ఇంగ్లీష్‌, హిందీ, బెంగాళి, పంజాబి, తెలుగు, మరాఠి, ఉర్దూ, గుజరాతి, కన్నడ, మళయాలం భాషల్లో మీకు కావాల్సిన దాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. 
  • మీ ఫోన్‌ లాంగ్వేజ్‌ను వాట్సాప్‌ ఫాలో అవుతూ ఉంటుంది
  • ఒకవేళ మీ ఫోన్‌ లాంగ్వేజ్‌ను హిందీలోకి మారిస్తే, వాట్సాప్‌ టెక్ట్స్‌ అంతా వెంటనే హిందీలోకి మారిపోతోంది.

ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ బట్టి ఈ ప్రక్రియలో కొన్ని మార్పులుంటాయి.
ఆండ్రాయిడ్‌ యూజర్లు...

  • సెట్టింగ్స్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలి
  • లాంగ్వేజస్‌ అండ్‌ ఇన్‌పుట్‌ను ట్యాప్‌ చేయాలి
  • లాంగ్వేజస్‌ను ఓపెన్‌ చేయాలి
  • మీకు కావాల్సిన లాంగ్వేజ్‌ను ఎంపిక చేసుకోవాలి
  • అనంతరం వాట్సాప్‌ ఓపెన్‌ చేస్తే, దానిలో టెక్ట్స్‌ అంతా మీరు ఎంపిక చేసుకున్న భాషల్లోనే వస్తోంది

ఐఓఎస్‌ యూజర్ల కోసం...

  • సెట్టింగ్స్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలి
  • జనరల్‌ను ట్యాప్‌ చేయాలి
  • లాంగ్వేజ్‌ అండ్‌ రీజన్‌లోకి వెళ్లాలి
  • ఐఫోన్‌ లాంగ్వేజ్‌ను ఎంపిక చేసుకోవాలి
  • అనంతరం మీకు కావాల్సిన భాషను ఎంచుకోవాలి
  • తదుపరి వాట్సాప్‌ ఓపెన్‌ చేస్తే, టెక్ట్స్‌ అంతా ఎంపిక చేసుకున్న భాషలో వచ్చేస్తోంది
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top