బిగ్‌ ‘సి’లో ‘హానర్‌ 9ఎన్‌’ స్మార్ట్‌ ఫోన్‌ | Honor 9 smart phone in Big C | Sakshi
Sakshi News home page

బిగ్‌ ‘సి’లో ‘హానర్‌ 9ఎన్‌’ స్మార్ట్‌ ఫోన్‌

Aug 2 2018 12:32 AM | Updated on Aug 2 2018 2:03 PM

Honor 9 smart phone in Big C - Sakshi

ప్రముఖ మొబైల్‌ రిటైల్‌ చెయిన్‌ బిగ్‌ ‘సి’లో ప్రఖ్యాత ఇ–బ్రాండ్‌ ‘హానర్‌ 9ఎన్‌ 4+128 జీబీ’ స్మార్ట్‌పోన్‌ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌ బిగ్‌ ‘సి’ షోరూమ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో బ్రాండ్‌ అంబాసిడర్‌ రాశిఖన్నా ఈ మొబైల్‌ ఆవిష్కరించారు.  

కార్యక్రమంలో బిగ్‌ ‘సి’ ఫౌండర్, సీఎండీ ఎం బాలు చౌదరితోపాటు యూటీఎల్‌ ఎండీ సుధీర్‌ హాసిజ, ఎల్‌ఎఫ్‌ఆర్‌ బిజినెస్‌ సంస్థ డైరెక్టర్‌ హితేష్‌ శర్మ, బిగ్‌ ‘సి’ డైరెక్టర్లు వై స్వప్న కుమార్, జీ బాలాజీ రెడ్డి, ఆర్‌ గౌతమ్‌ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలు చౌదరి మాట్లాడుతూ, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లలో ఒకే ధర ఉందని తెలిపారు. రూ.17,999 ధరకు సఫైర్‌ బ్లూ, మిడ్‌నైట్‌ బ్లాక్‌ కలర్స్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ లభిస్తుంది. 

Advertisement
 
Advertisement
Advertisement