ముందు రెండు, వెనుక రెండు కెమెరాలు

Honor 9 Lite With Quad Cameras Launched in India - Sakshi

న్యూఢిల్లీ : హువావే బ్రాండ్‌ హానర్‌, న్యూఢిల్లీ వేదికగా సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను నేడు(బుధవారం) లాంచ్‌ చేసింది. క్వాడ్‌-కెమెరాతో హానర్‌ 9 లైట్‌ పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను హానర్‌ మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లోనే జనవరి 21 నుంచి అందుబాటులోకి రానుంది. ముందు రెండు, వెనుక రెండు కెమెరాలు మాత్రమే కాక, ఆండ్రాయిడ్‌ 8.0 ఓరియో ఆధారిత లేటెస్ట్‌ ఈఎంయూఐ 8.0తో రన్‌ కావడం ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకత. రెండు స్టోరేజ్‌ వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయింది.
 

హానర్‌ 9 లైట్‌ ధర, లాంచ్‌ ఆఫర్లు
3జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర 10,999 రూపాయలు కాగ, 4జీబీ ర్యామ్‌, 64జీబీ వేరియంట్‌ ధర 14,999 రూపాయలు.  ఈ రెండు వేరియంట్లు ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో, హానర్‌ ఇండియా స్టోర్‌లో ఫ్లాష్‌ సేల్‌ ద్వారా లభ్యం కానున్నాయి. తొలి ఫ్లాష్‌ సేల్‌ జనవరి 21 అర్థరాత్రి 12 గంటలకు, రెండో ఫ్లాష్‌ సేల్‌ అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించనున్నారు. ఆ సేల్స్‌ అనంతరం మరో రెండు సేల్స్‌ జనవరి 22, 23 తేదీల్లో మధ్యాహ్నం జరుగనున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేసే సిటీ బ్యాంకు క్రెడిట్‌, డెబిట్‌ కార్డు యూజర్లకు ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ కింద 10 శాతం హానర్‌ ఆఫర్‌ చేయనుంది.

హానర్‌ 9 లైట్‌ స్పెషిఫికేషన్లు...
డ్యూయల్‌-సిమ్‌ స్మార్ట్‌ఫోన్‌
5.65 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ప్లస్‌ ఐపీఎస్‌ డిస్‌ప్లే
ఆక్టాకోర్‌ హువావే హాయ్సిలికాన్ కిరిన్‌ 659 ఎస్‌ఓసీ
3జీబీ ర్యామ్‌, 4జీబీ ర్యామ్‌ వేరియంట్లు
256జీబీ వరకు విస్తరణ మెమరీ
మొత్తం నాలుగు కెమెరాల
ముందు, వెనుక 13 మెగాపిక్సెల్‌తో ప్రైమరీ కెమెరా, సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్‌ 
3000ఎంఏహెచ్‌ బ్యాటరీ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top