హానర్‌ 7ఎస్‌ వచ్చేసింది..

Honor 7S India launch today - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: హువావే సబ్‌బ్రాండ్‌ హానర్‌ మరో నూతన స్మార్ట్‌ఫోన్ హానర్ 7ఎస్ ను నేడు (మంగళవారం) మధ్యాహ్నం 2 గంటలకు లాంచ్‌ చేసింది. ఇప్పటికే  7ఎస్‌ టీజర్‌ను రిలీజ్‌ చేసిన కంపెనీ,  ఇండియా మార్కెట్‌లో లాంచింగ్‌ను కూడా ట్విటర్‌ ద్వారా ధృవీకరించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.6,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ కొత్త బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్‌క్లూజివ్‌గా ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లో మాత్రమే లభ్యం కానుంది. మూడు రంగులు బ్లూ, బ్లాక్‌, గోల్డ్‌లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ విక్రయానికి వస్తోంది. సెప్టెంబర్‌ 14 నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. హానర్‌ 7ఎస్‌ను మే నెలలో పాకిస్తాన్‌, చైనాలో లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు హానర్‌ 9ఎన్‌ (3జీబీ, 32 జీబీ స్టోరేజ్) ధర. 11,999లు  సేల్‌ను  ఫ్లిప్‌కార్ట్‌ద్వారా మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు  ప్రత్యేకంగా ప్రారంభించింది.

హానర్ 7ఎస్ ఫీచర్లు
5.45 ఇంచ్ డిస్‌ప్లే, 18.9 యాస్పెక్ట్‌ రేషియో
1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్
256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
3020 ఎంఏహెచ్ బ్యాటరీ

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top