నేహా ధుపియా : హానర్‌ స్మార్ట్‌ఫోన్లు

Honor 7A, 7C India launched specifications, features price - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: హువావే  సబ్‌-బ్రాండ్ హానర్  రెండు  కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది.  బడ్జెట్‌ ధరల్లో హానర్‌ 7ఏ, 7సీ పేరుతో  ఇండియాలో ప్రారంభించింది.  గత నెల చైనాలో లాంచ్‌ చేయగా మంగళవారం భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రముఖనటి నేహా ధుపియా   మీదుగా ఈ రెండు డివైస్‌లను లాంచ్‌ చేసింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు ప్రత్యేకంగా ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా  విక్రయానికి  లభ్యం.  ముఖ‍్యంగా షావోమికి చెందిన రెడ్‌ మీ 5, 5ఏకు పోటీగా ఫేస్‌ అన్‌లాక్‌, డ్యుయల్‌ రియర్‌ కెమెరా  ప్రధాన ఫీచర్లుగా వీటిని లాంచ్‌ చేసింది. భారత వినియోగదారుల కోసం పేటీఎం ఫీచర్‌తోపాటు రైడర్స్‌ సౌకర్యంకోసం రైడ్‌మోడ్‌ అనే ఫీచర్‌ను యాడ్‌ చేశామని హానర్‌ ఇండియా ప్రతినిధి  సుమీత్‌ అరోరా తెలిపారు.  ఇండియా టాప్‌ 5 ‍  బ్రాండ్‌గా హానర్‌ నిలిచిందని పేర్కొన్నారు.  షావోమీ, వన్‌ప్లస్‌తో పోలిస్తే 146 శాతం హయ్యస్ట్‌  గ్రోత్‌ సాధించామని సుశీల్‌ తారిఖ్‌  హువావే చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌  ప్రకటించారు.  జియో భాగస్వామ్యంతో మోర్‌ డేటా, మోర్‌ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ అందిస్తున్నామని హానర్‌ తెలిపింది.
 

హానర్‌ 7ఏ ఫీచర్లు
5.99 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే
720 x 1440 రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్‌ ఓరియో 8.0
స్నాప్‌డ్రాగన్‌ 450 ప్రాసెసర్‌
3జీబీ/32జీబీ స్టోరేజ్‌
13+2ఎంపీ రియర్‌ కెమెరా,
8ఎంపీ సెల్ఫీ కెమెరా  
4జీబీ ర్యామ్‌ /64జీబీ స్టోరేజ్‌
3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
బ్లాక్‌, బ్లూ, గోల్డ్‌ కలర్స్‌ లో లభ్యం

హానర్‌ 7సీ ఫీచర్లు
5.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే
720 x1440 రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్‌ ఓరియో 8.0
స్నాప్‌డ్రాగన్‌ 400 ప్రాసెసర్‌
3జీబీ/4జీబీ ర్యామ్‌
32జీబీ/64జీబీ స్టోరేజ్‌
13+2ఎంపీ రియర్‌ కెమెరా,
8 ఎంపీ సెల్ఫీ కెమెరా  
3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

ధరలు:  7ఏ  ధర   8,999 రూపాయలు  నిర‍్ణయించింది. ఇది మే29 నుంచి ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోఉంటుంది.  కాగా  7 సీ ధర   రూ.9,600, 11,999 రూపాయలు ఉంది. ఇది అమెజాన్‌ ద్వారా  మే31న  విక్రయానికి లభ్యం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top