
బాలీవుడ్ నటి నేహా ధూపియా (Neha Dhupia) 2018లో నటుడు అంగద్ బేడీని పెళ్లి చేసుకుంది. సీక్రెట్‌గా డేటింగ్ చేసిన వీరిద్దరూ తమ ప్రేమవిషయాన్ని ఎన్నడూ బయటపెట్టలేదు. అలాంటిది సడన్‌గా వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట ప్రత్యక్షం కావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. పెళ్లయిన ఆరు నెలలకే ఈ జంటకు మెహర్ అనే కూతురు జన్మించింది. కానీ.. మ్యారేజ్‌కు ముందే నేహా ప్రెగ్నెంట్ కావడంతో నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి.
ఇదే రచ్చ
తాజాగా ఈ ట్రోలింగ్ గురించి నేహా ధూపియా మాట్లాడుతూ.. నేను అంగద్‌ను పెళ్లాడిన ఆరు నెలలకే పాప పుట్టింది. పెళ్లయిన ఆరు నెలలకే పాప ఎలా పుట్టింది? అలా ఎలా జరుగుతుంది? అని చర్చ మొదలుపెట్టారు. పెళ్లికి ముందే గర్భం దాల్చిన మహిళా నటుల గురించి ఇప్పటికీ స్టోరీలు వస్తూ ఉంటాయి. వాటిని నేను కూడా చూస్తూ ఉంటాను.
ఆ లిస్టులో ఉన్నా..
నీనా గుప్తా, ఆలియా భట్‌ల జాబితాలో నేను ఉన్నాను. కానీ దీన్ని ఇంతలా హైలైట్ చేయడం చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది అని చెప్పుకొచ్చింది. కాగా నీనా గుప్తా.. క్రికెటర్ వివియన్ రిచర్డ్స్‌ను ప్రేమించింది. వీరి అనురాగానికి గుర్తుగా మసాబా గుప్తా జన్మించింది. బాలీవుడ్ స్టార్ జంట ఆలియా భట్- రణ్‌బీర్ కపూర్.. 2018 నుంచి ప్రేమించుకున్నారు. 2022 ఏప్రిల్‌లో పెళ్లి చేసుకున్నారు. అదే ఏడాది నవంబర్‌లో కూతురు రాహా జన్మించింది.
చదవండి: క్యాన్సర్ బారిన పడ్డ నటి.. అన్నిటికంటే అదే దారుణమంటూ..