మళ్లీ మార్కెట్లోకి నోకియా స్మార్ట్‌ఫోన్లు | HMD Global launches Nokia 3, 5 and 6 smartphones in India | Sakshi
Sakshi News home page

మళ్లీ మార్కెట్లోకి నోకియా స్మార్ట్‌ఫోన్లు

Jun 14 2017 12:50 AM | Updated on Sep 5 2017 1:31 PM

మళ్లీ మార్కెట్లోకి నోకియా స్మార్ట్‌ఫోన్లు

మళ్లీ మార్కెట్లోకి నోకియా స్మార్ట్‌ఫోన్లు

నోకియా స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌లోకి మళ్లీ ఎంట్రీ ఇస్తున్నాయి.

న్యూఢిల్లీ: నోకియా స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌లోకి మళ్లీ ఎంట్రీ ఇస్తున్నాయి. నోకియా బ్రాండ్‌ మార్కెటింగ్‌ అధికారాలు చేజిక్కించుకున్న హెచ్‌ఎండీ గ్లోబల్‌ తాజాగా మూడు నోకియా స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్‌లో ఆవిష్కరించింది. వీటి ప్రారంభ ధర రూ.9,499గా ఉంది.

జూన్‌ 16 నుంచి అందుబాటులోకి..
నోకియా–3, నోకియా–5 స్మార్ట్‌ఫోన్లు కేవలం రిటైల్‌ స్టోర్లలో మాత్రమే లభించనున్నాయి. వీటి ధరలు వరుసగా రూ.9,499గా, రూ.12,899గా ఉన్నాయి. నోకియా–3 స్మార్ట్‌ఫోన్లు జూన్‌ 16 నుంచి అందుబాటులోకి రానున్నవి. ఇక నోకియా–5 స్మార్ట్‌ఫోన్స్‌ను జూలై 7 నుంచి ప్రి–బుకింగ్‌ చేసుకోవచ్చు. ఇక నోకియా–6 స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.14,999గా ఉంది. వీటిని జూలై 14 నుంచి కేవలం అమెజాన్‌.ఇన్‌లో మాత్రమే ప్రి–బుకింగ్‌ చేసుకోవచ్చు. ఇక హెచ్‌ఎండీ భారత్‌లో 400 మంది డిస్ట్రిబ్యూటర్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement