హార్లీ డేవిడ్సన్‌ న్యూ బైక్స్‌ ఇవే... | Harley-Davidson Softail range launched in India | Sakshi
Sakshi News home page

హార్లీ డేవిడ్సన్‌ న్యూ బైక్స్‌ ఇవే...

Oct 12 2017 8:15 PM | Updated on Oct 13 2017 8:17 AM

Harley-Davidson Softail range launched in India

సాక్షి,న్యూఢిల్లీ: హార్లీ డేవిడ్సన్‌ ఇండియా గురువారం తన 2018 రేంజ్‌ సాఫ్టెయిల్‌ మోటార్‌ సైకిల్స్‌ను లాంఛ్‌ చేసింది. వీటిలో స్ట్రీట్‌బాబ్‌, ఫ్యాట్‌ బాయ్‌, ఫ్యాట్‌ బాబ్‌, హెరిటేజ్‌ క్లాసిక్‌ మోడల్స్‌ ఉన్నాయి. వీటి ధరలు వరుసగా రూ 11.99 లక్షలు, రూ 13.99 లక్షలు, రూ 17.49 లక్షలు, రూ 18.99 లక్షలుగా కంపెనీ పేర్కొంది.

నూతన మోడల్స్‌ బైక్‌ ఔత్సాహికులకు, రైడర్స్‌కు వినూత్న ఉత్పత్తులు అందించాలన్న స్పృహతో రూపొందించినవని హార్లీ డేవిడ్సన్‌ ఇండియా, చైనా మేనేజింగ్‌ డైరెక్టర్‌ పీటర్‌ మెకంజీ పేర్కొన్నారు. ఈ బైక్స్‌ ఫస్ట్‌ లుక్‌కు అద్భుత స్పందన వచ్చిందని, లీజర్‌ మోటార్‌సైక్లింగ్‌ క్రీడలో ఇవి మైలురాయిగా నిలుస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement