భారీగా పెరిగిన పసిడి దిగుమతులు

భారీగా పెరిగిన పసిడి దిగుమతులు - Sakshi


న్యూఢిల్లీ: బంగారం దిగుమతులు   మే  నెలలో భారీగా పెరిగాయి. గత ఏడాది ఇదేకాలంలో దిగుమతులతో పోలిస్తే నాలుగురెట్లు  పెరిగి  2017 మే నెలలో 103 టన్నులను దిగమతి చేసుకుంది. మే 2016లో 25.3 టన్నుల దిగుమతులను రిపోర్ట్‌  చేసింది.  2017సం.రంలోని మొదటి అయిదునెలలో 144 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఈ కాలానికి బంగారం దిగుమతులు  424.1 టన్నులకు చేరుకున్నాయని జిఎఫ్ఎస్ఎం తాత్కాలిక డేటా వెల్లడించింది.

ముఖ్యంగా జీఎస్‌టీ బిల్లు అంచనాలతో  ఈ వృద్ధిని సాధించిన తాజా నివేదికలు  చెబుతున్నాయి. ముఖ్యంగా  ఏప్రిల్ చివరి వారంలో అక్షయ తృతియ సందర్భంగా  మంచి అమ్మకాలు నమోదైనట్టు  థామ్సన్ రాయిటర్స్ విభాగం జీఎఫ్‌ఎం సీనియర్ విశ్లేషకుడు సుధీష్ నంబియాత్ సోమవారం చెప్పారు.

 ధరల తగ్గముఖం పట్టడంతో  మే నెలలో పసిడి   కొనుగోళ్లు పుంజుకున్నాయని కోల్‌తాలోని  జె.జె. గోల్డ్ హౌస్ యజమాని హర్షద్ అజ్మార్ చెప్పారు. మే నెలలో రెండో వారంలో ఫ్రెంచ్ అధ్యక్ష ఎన్నికలో ఇమ్మాన్యూల్ మాక్రోన్ విజయం సాధించిన నేపథ్యంలో బంగారం ధరలు ఎనిమిది వారాల కనిష్టానికి దిగజారాయి.


మరోవైపు పుత్తడిపై జీఎస్‌టీ 3శాతం పన్ను రేటునిర్ణయంతో మార్కెట్లో జ్యువెల్లరీ  కౌంటర్‌ లో డిమాండ్‌ పెట్టింది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో ఈ షేర్లు మెరుపులు మెరిపించింది. ముఖ్యంగా   టైటన్‌ 17 శాతం దూసుకెళ్లగా ఇదే బాటలో  పీసీ జ్యువెల్లర్స్‌, తార  జ్యువెల్లరీ తదితర షేర్లు పయనించాయి.   రెండవ అతి పెద్ద వినియోగదారుగా ఇండియా దిగుమతులు పెరగడంతో, ఆరు వారాల గరిష్ట వద్దున్న అంతర్జాతీయ ధరలకు మద్దతు ఇస్తుందని, అయితే దక్షిణాసియా దేశాల వాణిజ్య లోటును పెంచవచ్చని ఎనలిస్టుల అంచనా.  కాగా పరిశ్రమల అంచనాలకు భిన్నంగా బంగారంపై జీఎస్‌టీ పన్నురేటును 3శాతంగా నిర్ణయించిన సంగతి తెలిసిందే.

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top