విదేశీ రూట్లలో గోఎయిర్‌ సేవలు..

GoAir to launch international operations - Sakshi

ముంబై– ఫుకెట్‌ మధ్య అక్టోబర్‌లో తొలి ఫ్లయిట్‌

ముంబై: దేశీ చౌక చార్జీల విమానయాన సంస్థ గోఎయిర్‌ తాజాగా అంతర్జాతీయ రూట్లలో సర్వీసులు ప్రారంభించనుంది. అక్టోబర్‌లో ముంబై–ఫుకెట్‌ రూట్‌లో డైలీ ఫ్లయిట్‌ను నడపనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి గురువారం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని, త్వరలోనే టికెట్ల బుకింగ్‌ ప్రారంభం కావొచ్చని వివరించాయి. వచ్చే ఏడాది మార్చికి మూడు లేదా నాలుగు విదేశీ ప్రాంతాలకు సేవలు ప్రారంభించవచ్చని సదరు వర్గాలు తెలిపాయి.

ఫుకెట్‌ (థాయ్‌లాండ్‌) తర్వాత లిస్టులో మాలే (మాల్దీవులు) ఉంటుందని పేర్కొన్నాయి. 2005లో గోఎయిర్‌ కార్యకలాపాలు ప్రారంభించింది. రెండేళ్ల క్రితమే విదేశీ సర్వీసులకు అనుమతులు కూడా వచ్చాయి. గతేడాది అక్టోబర్‌లోనే ప్రారంభించాలని భావించినప్పటికీ కీలకమైన ఎయిర్‌బస్‌ ఏ320 నియో విమాన ఇంజిన్లలో సాంకేతిక లోపాల కారణంగా వాయిదాపడింది. గోఎయిర్‌ ప్రస్తుతం 23 ప్రాంతాలకు వారానికి 1,544 ఫ్లయిట్స్‌ నడుపుతోంది. కంపెనీ వద్ద 38 ఎయిర్‌బస్‌ ఏ320 విమానాలున్నాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top