వాట్సాప్‌లో మీ ట్రైన్‌ స్టేటస్‌.. చెక్‌చేసుకోండిలా.. | Get Instant Details Of Your Train Status Using WhatsApp | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌లో మీ ట్రైన్‌ స్టేటస్‌.. చెక్‌చేసుకోండిలా..

Jul 24 2018 2:39 PM | Updated on Jul 24 2018 2:40 PM

Get Instant Details Of Your Train Status Using WhatsApp - Sakshi

వాట్సాప్‌లో ట్రైన్‌ స్టేటస్‌ వివరాలు

న్యూఢిల్లీ : మీరు ప్రయాణించాలనుకునే రైలు, ఎక్కడుంది..? ఇంకెంత సేపట్లో ప్లాట్‌ఫామ్‌ మీదకు వస్తుంది? అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ వాట్సాప్‌ తీసి ఓ మెసేజ్‌ చేసేయండి. క్షణాల్లో మీరు ప్రయాణించాలనుకునే రైలు స్టేటస్‌ అప్‌డేట్లన్నీ మీ ముందుంటాయి. రైలు ప్రయాణాన్ని మరింత సులభతరం, ప్యాసెంజర్‌ ఫ్రెండ్లీ చేసేందుకు దేశీయ రైల్వే పలు చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ట్రావెల్‌ పోర్టల్‌ మేక్‌మైట్రిప్‌తో దేశీయ రైల్వే భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. ఈ భాగస్వామ్యంలో రైలు రన్నింగ్‌ స్టేటస్‌ అప్‌డేట్లను ప్రయాణికులు వెంటనే తెలుసుకునేలా అవకాశం కల్పిస్తోంది. దీని కోసం ఓ వాట్సాప్‌ నెంబర్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.

  • తొలుత ఆ నెంబర్‌ను మీ ఫోన్‌లో సేవ్‌ చేసుకోవాలి, ఆ మొబైల్‌ నెంబర్‌  7349389104
  • ఆ తర్వాత వాట్సాప్‌కు వెళ్లాలి, వాట్సాప్‌ నుంచి ఆ నెంబర్‌కు మీ ట్రైన్‌ నెంబర్‌ పంపించాలి.
  • డబుల్‌ క్లిక్‌ వచ్చేంత వరకు వేచి చూడాలి.
  • ఒక్కసారి ఈ మెసేజ్‌ డెలివరీ అయ్యాక, మీ ట్రైన్‌ వివరాలను మీరు పొందవచ్చు.
  • మెసేజ్‌ పంపించిన 10 సెకన్ల కంటే తక్కువ వ్యవధిలోనే ట్రైన్‌ స్టేటస్‌ అప్‌డేట్‌ను ప్రయాణికులు పొందుతారు.

రైల్వే మంత్రి పియూష్ గోయల్ ఇటీవలే ప్రయాణీకుల ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించడానికి 'రైల్ మడాడ్‌' అనే అప్లికేషన్‌ను ప్రారంభించింది. మినిమమ్‌ ఇన్‌పుట్స్‌తో ప్యాసెంజర్లు తమ ఫిర్యాదును రిజిస్ట్రర్‌ చేయడానికి అనుమతి ఇస్తుంది. ఫిర్యాదును నమోదు చేసిన అనంతరం, సంబంధిత అధికారులకు ఆన్‌లైన్లోనే దీన్ని బదిలీ చేస్తారు. ఆ ఫిర్యాదుపై చర్యలు తీసుకుని, వెంటనే ప్రయాణికులకు ఆ విషయాన్ని ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలియజేస్తారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement