ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ వివిధ మొబైల్ ఫోన్స్ భారీ ఆఫర్లను ప్రకటించింది. మంత్ ఎండ్ మొబైల్స్ ఫెస్ట్ సేల్ పేరుతో ఐ ఫోన్, నోకియా, హానర్ బ్రాండ్స్ స్మార్ట్‌ఫోన్లను తగ్గింపు ధరల్లో అందుబాటులోకి తెచ్చింది. మే 31 వరకు సేల్ నిర్వహిస్తోంది. బిగ్ షాపింగ్ సేల్ మిస్ అయినవారికి ఈ మంత్ ఎండ్‌సేల్ ఉపయోగపడుతుందని ఫ్లిప్‌కార్ట్ భావిస్తోంది.
ఈ సేల్‌లో భాగంగా  యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లు వారి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ద్వారా నిర్వహించే ఈఎంఐ లావాదేవీలపై 5 శాతం తక్షణ డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే రెగ్యులర్ డిస్కౌంట్‌తోపాటు ఎక్స్చేంజ్ ఆఫర్ సదుపాయం కూడా ఉంది. కేవలం రూ.99కే మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్ పొందొచ్చు. నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం ఉంది.
ఆపిల్ ఐఫోన్ ఎక్స్  (64జీబీ స్టోరేజ్) :  రూ.66,499కు కొనుగోలు చేయవచ్చు. అసలు ధర రూ.91,900. సుమారు రూ.25 వేల భారీ తగ్గింపు
నోకియా 5.1 ప్లస్ : (3 జీబీ ర్యామ్/32 జీబీ  స్టోరేజ్) ధర రూ.8,199కే  అందుబాటులో ఉంది. అసలు ధర. 13,199
నోకియా 6.1  : రూ.12,999. అసలు ధర రూ.17,600
హానర్ 9ఎన్  : ధర రూ.8,499.  అసలు ధర. 13,999
హానర్ 10 లైట్ (4 జీబీ ర్యామ్/64 జీబీ మెమరీ) : రూ.11,999, అసలు ధర రూ. 16, 999
ఎంఐ ఏ2 ఫోన్‌ను రూ.9,999 ప్రారంభ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇంకా శాంసంగ్ గెలాక్సీ నోట్ 8 రూ. 36,990 (రూ.74,000) అలాగే గెలాక్సీ ఎ 20పై 1500 రూపాయల ఎక్స్చేంజ్ ఆఫర్.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
