ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త పేమెంట్‌ ఆప్షన్‌

Flipkart Cardless Credit Introduced - Sakshi

బెంగళూరు : దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌, అంతర్జాతీయ కంపెనీ అమెజాన్‌ను అనుసరిస్తోంది. ఈ రెండు కంపెనీల మధ్య తీవ్ర పోటీ ఉన్నప్పటికీ, అమెజాన్‌ ప్రవేశపెడుతున్న కొన్ని వినూత్న ఫీచర్లను, ఫ్లిప్‌కార్ట్‌ కూడా లాంచ్‌ చేస్తోంది. అమెజాన్‌ ఇండియా ‘అమెజాన్‌ పే ఈఎంఐ క్రెడిట్‌ ఆప్షన్‌’ను లాంచ్‌ చేసిన కొన్ని రోజుల్లోనే ఫ్లిప్‌కార్ట్‌ కొత్త పేమెంట్‌ ఆప్షన్‌ కార్డ్‌లెస్‌ క్రెడిట్‌ను తన కస్టమర్ల ముందుకు తీసుకొచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌ కొత్త పేమెంట్‌ ఆప్షన్‌ కార్డ్‌లెస్‌ క్రెడిట్‌ కింద కొనుగోలుదారులకు ఇన్‌స్టాంట్‌ క్రెడిట్‌గా రూ.60వేల వరకు అందించనుంది. కొత్త కార్డ్‌లెస్‌ క్రెడిట్‌ సిస్టమ్‌.. సరియైన సమయంలో క్రెడిట్‌ అందించే ప్రక్రియను సరళీకృతం చేయడంతో పాటు, క్రెడిట్‌ అంచనాను, దరఖాస్తు ప్ర​క్రియను సులభతరం చేస్తుందని కంపెనీ ప్రకటించింది. 

ఫ్లిప్‌కార్ట్‌ ప్లాట్‌ఫామ్‌పై 45 మిలియన్‌ కస్టమర్లకు క్రెడిట్‌ యాక్సస్‌ లేదని గుర్తించిన తర్వాతనే కార్డ్‌లెస్‌ క్రెడిట్‌ను తీసుకొచ్చామని తెలిపింది. క్రెడిట్‌ కార్డులు లేదా క్రెడిట్‌ లిమిట్స్‌ యాక్సస్‌ పొందలేని మధ్యతరగతి మొబైల్‌ యాక్టివ్‌ రుణగ్రహీతలు తమ కార్డ్‌లెస్‌ క్రెడిట్‌ కస్టమర్లని పేర్కొంది. వీరి షాపింగ్‌ ప్రవర్తనను పూర్తిగా అర్థం చేసుకుని, పరిశీలించిన అనంతరం, వారి షాపింగ్‌ అనుభవాన్ని చౌకగా అందించేందుకు సాధారణ, పారదర్శకత మార్గంలో క్రెడిట్‌ను ఆఫర్‌ చేయడం చేస్తోంది. 60 సెకన్లలోనే రూ.60వేల వరకు ఇన్‌స్టాంట్‌ క్రెడిట్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. తమ ప్లాట్‌ఫామ్‌పై వినియోగదారుల ప్రవర్తన బట్టి క్రెడిట్‌ను అందించనుంది. ఈ క్రెడిట్‌ పొందిన నెల తర్వాత లేదా 3-12 నెలల్లో ఈఎంఐ చెల్లించేలా ఈ ఇన్‌స్టాంట్‌ క్రెడిట్‌ యాక్సస్‌ను ఆఫర్‌ చేస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top