స్టార్టప్స్‌ కోసం ‘ఫేస్‌బుక్‌ హబ్స్‌’ | Facebook Hubs for Startups | Sakshi
Sakshi News home page

స్టార్టప్స్‌ కోసం ‘ఫేస్‌బుక్‌ హబ్స్‌’

Mar 13 2019 12:16 AM | Updated on Mar 13 2019 8:21 AM

Facebook Hubs for Startups - Sakshi

న్యూఢిల్లీ: కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు, ఔత్సాహిక వ్యాపారవేత్తలకు తోడ్పాటునందించేందుకు సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ముంబై తదితర నగరాల్లో ‘ఫేస్‌బుక్‌ హబ్స్‌’ను ప్రారంభిస్తున్నట్లు సంస్థ తెలిపింది.

స్టార్టప్‌ సంస్థలకు శిక్షణా కార్యక్రమాలు, వర్క్‌షాప్స్, మెంటార్స్‌తో సమావేశాలు మొదలైనవి వీటిలో నిర్వహిస్తామని ఫేస్‌బుర్‌ ఒక ప్రకటనలో తెలిపింది. స్టార్టప్‌ సంస్థలు, ఎంట్రప్రెన్యూర్స్‌ తమ వ్యాపారాలను మరింత మెరుగుపర్చుకునేందుకు తోడ్పడేలా ఏడాది పాటు నిర్వహించే ఈ ప్రోగ్రాం కోసం 91స్ప్రింగ్‌బోర్డ్‌ సంస్థతో జట్టు కట్టినట్లు పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement