సన్నీలియోన్‌, శిల్పాశెట్టిలను ప్రశ్నించనున్న ఈడీ

ED May Quiz Shilpa Shetty, Sunny Leone And Others In Bitcoin Scam - Sakshi

సాక్షి, ముంబయి : బిట్‌కాయిన్‌ కుంభకోణానికి సంబంధించి బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త, ప్రముఖ వ్యాపారి రాజ్‌ కుంద్రాను ప్రశ్నించిన ఈడీ, ఇదే కేసులో త్వరలో శిల్పాశెట్టితో పాటు సన్నీలియోన్‌ సహా మరికొందరిని ప్రశ్నించవచ్చని భావిస్తున్నారు. రాజ్‌ కుంద్రాను ఈడీ ప్రశ్నించిన క్రమంలో హైప్రొఫైల్‌ సెలెబ్రిటీలు సన్నీ లియోన్‌, ప్రాచీ దేశాయ్‌, ఆరతి చభ్రియా, సోనాల్‌ చౌహాన్‌, కరిష్మా తన్నా, జరీన్‌ ఖాన్‌, నేహ ధూపియా, హ్యూమా ఖురేష్‌, నర్గీస్‌ ఫక్రీ తదితరుల పేర్లు ప్రస్తావించినట్టు తెలిసింది.

ఇక రాజ్‌కుంద్రా భార్య శిల్పాశెట్టిని ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ కేసులో నిందితుడైన అమిత్‌ భరద్వాజ్‌ కంపెనీకి దుబాయ్‌, సింగపూర్‌లలో ఈ సెలబ్రిటీలు సహకరించినట్టు ఈడీ ఆరోపిస్తోంది. పూణేకు చెందిన వ్యాపారి భరద్వాజ్‌ను ఆరునెలల కిందట ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్‌ చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top