ఉద్యోగుల్లో మార్పునకు డ్యూక్స్‌ వినూత్న ప్రయోగం | dukes innovative experiment in Changes in employees | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల్లో మార్పునకు డ్యూక్స్‌ వినూత్న ప్రయోగం

Jan 9 2017 1:50 AM | Updated on Sep 5 2017 12:45 AM

ఉద్యోగుల్లో మార్పునకు డ్యూక్స్‌ వినూత్న ప్రయోగం

ఉద్యోగుల్లో మార్పునకు డ్యూక్స్‌ వినూత్న ప్రయోగం

బిస్కెట్లు, ఇతర ఆహార ఉత్పత్తుల్లో హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే ప్రముఖ కంపెనీ డ్యూక్స్‌ తన ఉద్యోగులకు బ్రహ్మకుమారీ

హైదరాబాద్‌: బిస్కెట్లు, ఇతర ఆహార ఉత్పత్తుల్లో హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే ప్రముఖ కంపెనీ డ్యూక్స్‌ తన ఉద్యోగులకు బ్రహ్మకుమారీ సంస్థల ద్వారా కౌన్సెలింగ్‌ ఇప్పించే చర్యలను చేపట్టింది. రోజువారీ యాంత్రిక జీవనం గడుపుతున్న కార్మికుల్లో తగిన మార్పునకు కౌన్సెలింగ్‌ దోహదం చేస్తుందని భావించిన డ్యూక్స్‌ ఎండీ రవీందర్‌ అగర్వాల్‌ ఈ మేరకు ఫ్యాక్టరీ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయించారు. డ్యూక్స్‌ సంస్థలో సుమారు 8వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

కౌన్సెలింగ్‌లో ప్రస్తుతం 60 నుంచి 70 మంది పాల్గొంటున్నారని, వచ్చే నెలకల్లా ఈ సంఖ్య 200కు చేరుకుంటుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. రోజువారీ జీవి తంలో  కుటుంబం, ఇరుగు పొరుగు, స్నేహితుల ద్వారా పొందిన  అనుభవాలు, వ్యక్తిగత విజయాలను ఈ వేదిక ద్వారా తోటి ఉద్యోగులతో పంచుకునేందుకు ప్రోత్సహిస్తున్నట్టు వెల్లడించింది. పారిశ్రామిక సంస్థలు ఉద్యోగుల జీవితంలో విశేషమైన మార్పులను ఎలా తీసుకురాగలవన్న దానికి డ్యూక్స్‌ అసాధార ణ ప్రయోగం చక్కని ఉదాహరణ అని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement