డవ్‌ యాడ్‌పై దుమారం | Dove apologises for 'racist' ad that shows black woman turning white | Sakshi
Sakshi News home page

డవ్‌ యాడ్‌పై దుమారం

Oct 9 2017 10:52 AM | Updated on Oct 9 2017 6:48 PM

Dove apologises for 'racist' ad that shows black woman turning white

షాంపులు, సబ్బుల ఉత్పత్తుల్లో మంచి బ్రాండు ఉన్న డవ్‌ వివాదంలో చిక్కుకుంది. తన ఫేస్‌బుక్‌ పేజీలో పోస్టు చేసిన ఓ యాడ్‌ మూలాన తీవ్ర విమర్శలు పాలవుతోంది. ఒక నల్లజాతీయురాలు తన షర్ట్‌ తీసేస్తే తెల్ల మహిళగా రివీల్‌ అవుతుందంటూ ఓ బాడీ వాష్‌ యాడ్‌ను తన ఫేస్‌బుక్‌ పేజీలో పోస్టు చేసింది. ఈ ప్రకటన తీవ్ర జాత్యహంకారాన్ని చూపుతుందని సోషల్‌ మీడియా యూజర్లు మండిపడుతున్నారు. దీంతో మూడు సెకన్లతో కూడిన ఓ వీడియో క్లిప్‌ను డవ్‌ విడుదల చేసింది. ఈ క్లిప్‌లో నిజమైన అందంపై డవ్‌ వైవిధ్యాన్ని చూపించడం లేదని, దీనిపై తాము తీవ్రంగా చింతిస్తున్నామని, క్షమాపణ చెబుతున్నట్టు కంపెనీ చెప్పింది. 

నల్ల జాతీయురాలు, తెల్ల జాతీయురాలుగా మారే విధంగా చూపించే ఈ సబ్బు ప్రకటన జాత్యహంకారాన్ని కలిగి ఉందని సోషల్‌ మీడియా యూజర్లంటున్నారు. అంటే నల్ల రంగు శరీరం చెత్త అని, తెల్ల రంగు శరీరం శుభ్రమైనదని ఈ యాడ్‌ ప్రతిపాదిస్తుందని విమర్శిస్తున్నారు. శుభ్రమైన శరీరమంటే, తెల్ల రంగు శరీరం కాదని, అలా అని నల్ల రంగు శరీరాలన్నీ చెత్త కాదని అట్లాంటకు చెందిన ఓ ప్రొఫెసర్‌ ట్వీట్‌ చేశారు. డవ్‌ ఉత్పత్తులను చాలా కాలంగా వాడుతున్నానని, కానీ ప్రస్తుతం వీటిని విడిచిపెడుతున్నట్టు పేర్కొన్నారు. ఇదే తొలిసారి కాదని, డవ్‌ చాలాసార్లు ఇలాంటి జాత్యంహకారం ప్రకటనలను ప్రచురించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement