
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ.80,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో సమీకరించిన రూ. లక్ష కోట్లుతో పోల్చితే ఇది 20 శాతం తక్కువ.డిజిన్వెస్ట్‌మెంట్‌లో భాగంగా నిధుల సమీకరణ నిమిత్తం మరిన్ని ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్)ను, ఒక డెట్ ఫండ్‌ను కూడా ఆరంభిస్తామని బడ్జెట్ ప్రతిపాదనల్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ.72,500 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అయితే ఇప్పటికే రూ. లక్ష కోట్లు సమీకరించేశామని వివరించారు.