దీపక్‌ కొచర్‌కు మళ్లీ ఐటీ నోటీసులు | Deepak Kothar again notices on IT | Sakshi
Sakshi News home page

దీపక్‌ కొచర్‌కు మళ్లీ ఐటీ నోటీసులు

Apr 26 2018 12:51 AM | Updated on Sep 27 2018 4:47 PM

Deepak Kothar again notices on IT - Sakshi

న్యూఢిల్లీ: వీడియోకాన్‌కు ఐసీఐసీఐ బ్యాంకు రుణం ఇచ్చిన కేసులో బ్యాంకు సీఈఓ చందా కొచర్‌ భర్త దీపక్‌ కొచర్‌కు ఆదాయపన్ను శాఖ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో పన్ను ఎగవేత అంశాన్ని ఐటీ శాఖ దర్యాప్తు చేస్తుండటం తెలిసిందే. దీపక్‌ కొచర్‌కు వ్యక్తిగత హోదాలోనే ఈ నోటీసులు జారీ చేశామని, నూపవర్‌ రెన్యువబుల్స్‌ కంపెనీ ఎండీగా దీపక్‌ కొచర్‌ వ్యక్తిగత ఆర్థిక అంశాలు, లావాదేవీల వివరాలు కోరామని ఐటీ వర్గాలు తెలిపాయి.

పది రోజుల్లోగా డాక్యుమెంట్లు సమర్పించాలని నోటీసుల్లో ఐటీ శాఖ కోరింది.  మారిషస్‌కు చెందిన రెండు సంస్థల (ఫస్ట్‌ లాండ్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్, డీహెచ్‌ రెన్యువబుల్స్‌ హోల్డింగ్స్‌) నుంచి నూపవర్‌ రెన్యువబుల్స్‌లోకి రూ.325 కోట్ల నిధుల రాకపై ఐటీ శాఖ తన దర్యాప్తులో ప్రత్యేకంగా దృష్టి సారించింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement