సైయంట్ ప్రత్యేక డివిడెండ్ | Cyient celebrates Silver Jubilee | Sakshi
Sakshi News home page

సైయంట్ ప్రత్యేక డివిడెండ్

Aug 30 2016 1:43 AM | Updated on Sep 4 2017 11:26 AM

సైయంట్ ప్రత్యేక డివిడెండ్

సైయంట్ ప్రత్యేక డివిడెండ్

ఐటీ ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయంట్ .. సిల్వర్ జూబిలీ వేడుకల సందర్భంగా ప్రత్యేక డివిడెండు ప్రకటించింది.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఐటీ ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయంట్ .. సిల్వర్ జూబిలీ వేడుకల సందర్భంగా ప్రత్యేక డివిడెండు ప్రకటించింది. రూ. 5 ముఖవిలువ గల షేరు ఒక్కింటిపై రూ. 2.50 (50 శాతం) అందించనున్నట్లు వివరించింది. ప్రత్యేక డివిడెండు రూపంలో మొత్తం రూ. 34 కోట్లు చెల్లించనున్నట్లు సైయంట్ పేర్కొంది. ప్రత్యేక డివిడెండుకు రికార్డు తేది సెప్టెంబర్ 9 కాగా, చెల్లింపు తేది సెప్టెంబర్ 16. మరోవైపు, ఉద్యోగులకు రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్స్ (ఆర్‌ఎస్‌యూ) పథకం కింద షేర్లను కేటాయించనున్నట్లు, ఆర్థికంగా దీని ప్రభావం రూ. 34 కోట్ల మేర ఉండనున్నట్లు సంస్థ తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement