భారత్ కోసం షియోమి ఎంఐ 4ఐ స్మార్ట్‌ఫోన్ | China's Xiaomi Unveils Mi 4i Smartphone in India | Sakshi
Sakshi News home page

భారత్ కోసం షియోమి ఎంఐ 4ఐ స్మార్ట్‌ఫోన్

Apr 24 2015 12:29 AM | Updated on Sep 3 2017 12:45 AM

భారత్ కోసం షియోమి ఎంఐ 4ఐ స్మార్ట్‌ఫోన్

భారత్ కోసం షియోమి ఎంఐ 4ఐ స్మార్ట్‌ఫోన్

షియోమి కంపెనీ భారత మార్కెట్‌ను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని రూపొందించిన...

ధర రూ.12,999
- ఈ నెల 30 నుంచి అందుబాటులోకి

న్యూఢిల్లీ: షియోమి కంపెనీ భారత మార్కెట్‌ను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని రూపొందించిన మి 4ఐ స్మార్ట్‌ఫోన్‌ను గురువారం ఆవిష్కరించింది. ఈ ఫోన్ ధర రూ.12,999గా నిర్ణయించామని షియోమి  వైస్ ప్రెసిడెంట్ హ్యుగో బర్రా  తెలిపారు. ఈ నెల 30 నుంచి ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభమవుతాయి. దీనికోసం గురువారం నుంచే ఫ్లిప్‌కార్ట్‌లో రిజిస్ట్రేషన్లు  మొదలయ్యాయి. వచ్చే నెల నుంచి హాంగ్‌కాంగ్, తైవాన్, సింగపూర్, మలేసియా, ఇండోనేషియాల్లో ఈ ఫోన్‌ను అందుబాటులోకి తెస్తారు.
 
 భారత వినియోగదారుల అవసరాలు, అభిరుచులను దృష్టిలో పెట్టుకొని ఈ ఫోన్‌ను రూపొందించామని బర్రా తెలియజేశారు. ఆండ్రాయిడ్ 5.0 లాలిపాప్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత ఎంఐయూఐ సాఫ్ట్‌వేర్‌పై పనిచేసే ఈ డ్యూయల్ సిమ్ ఫోన్‌లో 5 అంగుళాల హెచ్‌డీ ఓజీఎస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 2 జీబీ ర్యా మ్, 16 జీబీ మెమరీ, 13 మెగా పిక్సెల్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 4 జీ సపోర్ట్, 3,120 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి.
 
డేటా సెంటర్ ఏర్పాటు చేస్తాం
ఈ ఏడాది చివరికల్లా కానీ, వచ్చే ఏడాది ప్రారంభంలో కానీ   భారత్‌లో డేటా సెంటర్‌ను ఏర్పా టు చేస్తామని హ్యుగో బర్రా చెప్పారు. దీనికి ఎంత మొత్తం వెచ్చిస్తున్నామన్నది వెల్లడించకపోయినా దీనికోసం షియోమి భారీ మొత్తంలోనే ఇన్వెస్ట్ చేయనున్నదని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement