మైక్రోసాఫ్ట్ పేటెంట్లను కొన్న షియామి | China smartphone maker Xiaomi buys Microsoft patents | Sakshi
Sakshi News home page

మైక్రోసాఫ్ట్ పేటెంట్లను కొన్న షియామి

Jun 1 2016 4:58 PM | Updated on Nov 6 2018 5:26 PM

మైక్రోసాఫ్ట్  పేటెంట్లను కొన్న షియామి - Sakshi

మైక్రోసాఫ్ట్ పేటెంట్లను కొన్న షియామి

ప్రముఖ ఐటీ కంపెనీ మెక్రోసాఫ్ట్ నుంచి కొన్ని పేటెంట్ హక్కులను కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించింది. దీని ద్వారా ప్రపంచ వ్యాప్తంగా తమ వ్యాపార విస్తరణకు యోచిస్తున్నట్టు తెలిపింది.

బీజింగ్:  తనదైన వ్యూహాలతో  స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి దూసుకు వచ్చిన  చైనా  మొబైల్ కంపెనీ షియామీ మరో అడుగు ముందుకు వేసింది.  ప్రముఖ ఐటీ కంపెనీ మెక్రోసాఫ్ట్ నుంచి  కొన్ని పేటెంట్ హక్కులను కొనుగోలు చేయనున్నట్టు  ప్రకటించింది.  దీని ద్వారా ప్రపంచ వ్యాప్తంగా తమ  వ్యాపార విస్తరణకు  యోచిస్తున్నట్టు తెలిపింది. మైక్రోసాఫ్ట్ నుంచి  పేటెంట్లను  సొంతం చేసుకోనున్నట్లు   సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్  వాంగ్ జియాంగ్ తెలిపారు.  బ్రెజిల్   ప్రభుత్వ విధానం మూలంగా తాత్కాలికంగా  తమ కొత్త ఉత్పత్తుల లాంచింగ్  నిలిపివేసినట్టు  చెప్పారు. చైనాలో మళ్లీ తమఅంతర్జాతీయ వ్యాపారాన్ని పునరుద్ధరించనున్నట్టు వాంగ్ ప్రకటించారు. అమ్మకాలు  తక్కువగా ఉన్నప్పటికీ  ఉన్నత-శ్రేణి ఉత్పత్తులపై దృష్టి సారించినట్టు  చెప్పారు.

అటు ఈ వార్తలను  ధృవీకరించిన మైక్రోసాప్ట్ ..  60,000 కు పేటెంట్లు తమ  సొంతమనీ, ఈ పేటెంట్ల అమ్మకం చాలా చిన్న  వాటా అని  మైక్రోసేఫ్ట్  జెన్నిఫర్  క్రైడర్ ప్రతినిధి  చెప్పారు.  క్రమానుగతంగా  ఈ పేటెంట్లు షియామి సొంతం కానున్నాయని ఆమె తెలిపారు.  లెసెన్స్ ఒప్పందంతో పాటు, వైర్ లెస్ కమ్యూనికేషన్ , వీడియో తదితర టెక్నాలజీ పేటెంట్ లను విక్రయించామని స్పష్టం చేశారు.  మిగిలిన భాగస్వామ్యాలతో  పోలిస్తే ఇది పెద్దదని సంస్థ కార్పొరేట్ ఉపాధ్యక్షుడు జొనాధన్ టెలిఫోన్ ఇంటర్వ్యూలో మీడియాకు తెలిపారు.

కాగా భారత మార్కెట్లో  ఎంటరైన షియామి  మొబైల్ మార్కెట్ లో  మెరుగైన స్థానం కోసం తంటాలుపడుతోంది. ఇటీవలికాలంలో  ఎమ్ఐ 5, ఎమ్ఐ మాక్స్, రెడ్ మీ,నోట్ 3, ఎమ్ ఐ 4 ఎస్  స్మార్ట్ ఫోన్లతో భారత మార్కెట్లో హల్ చల్ చేస్తున్న సంగతి  తెలిసిందే.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement