హైదరాబాద్‌లో చైనా బిస్ట్రో రెస్టారెంట్ | China Bistro Restaurant in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో చైనా బిస్ట్రో రెస్టారెంట్

Jan 22 2016 2:52 AM | Updated on Sep 4 2018 5:07 PM

క్యాటరింగ్, ఫుడ్ రిటైల్ చైన్ వ్యాపారంలో ఉన్న ముంబైకి చెందిన ఫుడ్‌లింక్ రెస్టారెంట్స్ హైదరాబాద్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్యాటరింగ్, ఫుడ్ రిటైల్ చైన్ వ్యాపారంలో ఉన్న ముంబైకి చెందిన ఫుడ్‌లింక్ రెస్టారెంట్స్ హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో చైనా బిస్ట్రో రెస్టారెంట్‌ను ప్రారంభించింది. ఇందుకు రూ.6 కోట్లు ఖర్చు చేసింది. చైనాతోపాటు ఆసియా దేశాల వంటకాలు ఇక్కడ లభిస్తాయి. ముంబైలో కంపెనీ ఇప్పటికే ఇటువంటి రెస్టారెంట్లు నాలుగు నిర్వహిస్తోంది. గ్లోకల్ జంక్షన్, ఇండియా బిస్ట్రో, బంగళా-9 పేర్లతో మరో అయిదు రెస్టారెంట్లను ఏర్పాటు చేసింది. భాగ్యనగరిలో త్వరలోనే ఇండియా బిస్ట్రో, గ్లోకల్ జంక్షన్‌ను ప్రారంభిస్తామని ఫుడ్‌లింక్ రెస్టారెంట్స్ సీఎండీ సంజయ్ వజిరానీ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. దేశవ్యాప్తంగా 100 ఔట్‌లెట్లను తెరవాలన్నది లక్ష్యమని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement