డైమండ్‌ పవర్‌ ఇన్‌ఫ్రాపై కేసు నమోదు | case of Diamond Power Infra is registered | Sakshi
Sakshi News home page

డైమండ్‌ పవర్‌ ఇన్‌ఫ్రాపై కేసు నమోదు

Apr 6 2018 1:13 AM | Updated on Apr 6 2018 1:13 AM

case of Diamond Power Infra is registered - Sakshi

న్యూఢిల్లీ: బ్యాంకులకు భారీగా మోసగించిన మరో కేసు వెలుగులోకి వచ్చింది. గుజరాత్‌లోని వదోదర కేంద్రంగా పనిచేసే డైమండ్‌ పవర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్, దాని డైరెక్టర్లు బ్యాంకులకు రూ. 2,654 కోట్ల మేర మోసం చేసినట్టు సీబీఐ క్రిమినల్‌ కేసు నమోదు చేసింది.

వదోదరలో కంపెనీ కార్యాలయాలు, డైరెక్టర్ల నివాసాల్లో సోదాలు నిర్వహించింది. ఎలక్ట్రికల్‌ కేబుల్స్, ఎక్విప్‌మెంట్‌ తయారు చేసే డైమండ్‌ పవర్‌ ఇన్‌ఫ్రా 2008 తర్వాత 11 ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల కన్సార్షియం నుంచి మోసపూరితంగా రుణ సదుపాయం పొంది, 2016 జూన్‌ 29 నాటికి 2,654.40 కోట్లు బకాయి పడినట్టు సీబీఐ పేర్కొంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement