వేదాంత, కెయిర్న్ ఇండియాల విలీనానికి ఆమోదం తెలపలేదు | Cairn-Vedanta merger gets LIC's go-ahead: Sources | Sakshi
Sakshi News home page

వేదాంత, కెయిర్న్ ఇండియాల విలీనానికి ఆమోదం తెలపలేదు

Jul 13 2016 1:27 AM | Updated on Sep 4 2017 4:42 AM

వేదాంత, కెయిర్న్ ఇండియాల విలీనానికి ఆమోదం తెలపలేదు

వేదాంత, కెయిర్న్ ఇండియాల విలీనానికి ఆమోదం తెలపలేదు

వేదాంత కంపెనీలో కెయిర్న్ ఇండియా విలీనానికి ఎల్‌ఐసీ ఆమోదం తెలిపిందన్న వార్త వాస్తవం కాదని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా..

హైదరాబాద్: వేదాంత కంపెనీలో కెయిర్న్ ఇండియా విలీనానికి ఎల్‌ఐసీ ఆమోదం తెలిపిందన్న వార్త వాస్తవం కాదని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) తెలిపింది. కెయిర్న్ ఇండియా విలీనానికి ఎల్‌ఐసీ పచ్చజెండా ఊపిందని మీడియాలో ప్రచారమైందని, ఇది సత్యదూరమని ఎల్‌ఐసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విలీన ప్రతిపాదనకు ఎలాంటి ఆమోదం ఇవ్వలేదని ఎల్‌ఐసీ స్పష్టం చేసింది. కాగా ఈ విలీన ప్రతిపాదనకు ఎల్‌ఐసీ ఆమోదం తెలిపిందని, ఆగస్టు నుంచి విలీన కార్యక్రమాలు మొదలవుతాయని వార్తలు రావడంతో వేదాంత, కెయిర్న్ ఇండియాలు జోరుగా పెరిగాయి. బీఎస్‌ఈలో వేదాంత షేర్ 7% లాభంతో రూ.159.5 వద్ద, కెయిర్న్ ఇండియా 8.3 శాతం లాభంతో రూ.162.55 వద్ద ముగి శాయి. ఇంట్రాడేలో వేదాంత షేర్ ఏడాది గరిష్ట స్థాయి(రూ.162.50)ను తాకింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement