సెప్టెంబర్‌ 1 నుంచి కొత్త వాహనాలు కొంటే..

Buyers must pay up to Rs 24,000 on insurance for new vehicles from September 1 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  సుప్రీంకోర్టు ఆదేశాలకు మేరకు సెప్టెంబరు 1 న లేదా తర్వాత విక్రయించిన వాహనాలపై దీర్ఘకాలిక  థర్డ్‌ పార్టీ భీమా  వర్తించనుంది. ఈ మేరకు ఇన్సూరెన్స్ రెగ్యులేటర్, బీమా రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) అన్నిబీమా కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలకనుగుణంగా బీమా సంస్థలు థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌  సెగ్మెంట్‌లో ఇప్పుడు కార్ల కోసం మూడు సంవత్సరాల బీమా, ద్విచక్ర వాహనాలకు ఐదు సంవత్సరాల బీమాను ఆఫర్‌ చేయాలి. అలాగే కొత్త కారు, లేదా బైక్‌ కొనుగోలు చేసే వినియోగదారులు థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్‌ తీసుకోవడం తప‍్పనిసరి.  భవిష్యత్ వాహన కొనుగోలుదారులు  థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్‌ కింద కొత్త కార్ల కోసం రూ. 24వేల దాకా చెల్లించాల్సి ఉంటుంది. కొత్త మోటార్ సైకిల్స్‌ కొనుగోలు చేసినవారు 13వేల  రూపాయల దాకా చెల్లించాల్సి ఉంటుంది. వాహన్‌ మోడల్‌, ఇంజీన్‌ కెపాసిటీ ఆధారంగా  బీమాను నిర్ణయిస్తారు.

జూలై 20,2018న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో థర్డ్ పార్టీ వారికి కూడా ఇన్సూరెన్స్‌  ఇవ్వాలని బీమా సంస్థలను కోరింది. ఇంతకుముందు ఇది ఒక్క సంవత్సరం మాత్రమే థర్డ్ పార్టీకి బీమా కల్పించేది. ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌  విధానం ప్రకారం కొత్త రేట్లు సెప్టెంబర్ 1, 2018 నుంచి మార్చి 31,2019 వరకు కొత్త వాహనాలు కొనుగోలు చేసిన వారికి అమలు అవుతుందని ఐఆర్‌డీఏఐ ప్రకటించింది.   దీని ప్రకారం వాహనాలు కొనుగోలు చేసే సమయంలోనే మొత్తం మూడేళ్లకుగానీ ఐదేళ్లకుగానీ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.  వాహనం మరొకరికి అమ్మితేనే వాహన యజమానిపై ఉన్న థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ రద్దు చేసి...కొత్త యజమానికి బదిలీ చేయాల్సి ఉంటుంది.  ఇన్సూరెన్స్‌ ప్రీమియం  రేట్లవివరాలు ఇలా ఉన్నాయి.

ప్రైవేట్ కార్లకు: మూడేళ్ల ప్రీమియం
1000సీసీ మించకుండా ఉండే వాహనానికి రూ.5,286/-
1000సీసీ నుంచి 1500సీసీ మధ్య ఉండే వాహనానికి : రూ.9,534
1500 సీసీకి మించితే : రూ. 24,305


టూ వీలర్స్‌ : ఐదేళ్ల ప్రీమియం
75 సీసీ లోపు : రూ.1,045
75సీసీ నుంచి 150 సీసీ మధ్య : రూ. 3,285
150 సీసీ నుంచి 350 సీసీ మధ్య: రూ. 5453
350 సీసీకి మించి : రూ.13,034

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top