వ్యాపారాభివృద్ధిలో మొబైల్ ఫోన్, ఇంటర్నెట్, సోషల్ మీడీయా కీలక పాత్ర పోషిస్తున్నాయని..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యాపారాభివృద్ధిలో మొబైల్ ఫోన్, ఇంటర్నెట్, సోషల్ మీడీయా కీలక పాత్ర పోషిస్తున్నాయని, వీటిని ఉపయోగించుకొని చిన్న మధ్య స్థాయి కంపెనీలు అవకాశాలను అందిపుచ్చుకోవాలని సెయైంట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బి.వి.ఆర్.మోహన్ రెడ్డి తెలిపారు. మారుతున్న టెక్నాలజీతో వ్యాపార అవకాశాలు అందిపుచ్చుకోవడం అనే అంశంపై టాటా డొకొమో ‘ డు బిగ్ సింపోజియం’ నిర్వహించింది. ఈ కార్యక్రమంలోమోహన్ రెడ్డి మాట్లాడుతూ సోషల్ - మొబైల్ - ఇంటర్నెట్ (ఎస్‌ఎంఐ) వినియోగించుకోవడం ద్వారా మార్కెట్ వాటాను పెంచుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా టాటా డొకొమో ఎస్‌ఎంఐ సొల్యూషన్‌ను లాంఛనంగా ప్రారంభించింది.