బీఎస్‌ఎన్‌ఎల్‌ దసరా ఆఫర్‌: రోజుకు 2జీబీ డేటా  | BSNL Dussehra Offer,  Get unlimited voice and video calls | Sakshi
Sakshi News home page

బీఎస్‌ఎన్‌ఎల్‌ దసరా ఆఫర్‌: రోజుకు 2జీబీ డేటా 

Oct 16 2018 5:18 PM | Updated on Apr 6 2019 9:01 PM

BSNL Dussehra Offer,  Get unlimited voice and video calls - Sakshi

సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ దసరా ఆఫర్‌గా స్పెషల్‌ టారిఫ్‌ వోచర్‌ను  లాంచ్‌  చేసింది.   ప్రధాన ప్రత్యర్థులు జియో, ఎయిర్‌టెల్‌కు సవాలుగా బీఎస్‌ఎన్‌ఎల్‌ చవకైన ‍ ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది.  లిమిటెడ్‌ ఆఫర్‌గా  తీసుకొచ్చిన ఈ ప్లాన్‌తో కస్టమర్లను ఆకర్షిస్తోంది. 

ప్రీపెయిడ్ చందాదారుల కోసం ఒక ప్రత్యేక ఎస్‌టీవీ ప్రారంభించింది. రూ .78 ధరకే,  అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాలింగ్‌ ఆఫర్‌ చేస్తోంది.  ఈ పరిమితి కాలంగా లాంచ్‌ చేసిన ఇది అక్టోబర్ 15 నుండి  భారతదేశం అంతటా అందుబాటులోకి వచ్చింది.  అయితే, ప్రణాళిక కొన్ని ఆసక్తికరమైన ప్రయోజనాలను అందిస్తుంది. రోజుకు హై-స్పీడ్ 2జీబీ డేటాఆఫర్‌ చేస్తోంది.10 రోజుల వాలిడిటీ అంటే మొత్తం 20జీబీ డేటా వినియోగించుకోవచ్చు.  అంతేకాదు 3జీబీ టెక్నాలజీ ఫాస్ట్‌ వీడియో కాలింగ్ ఫీచర్ను తీసుకువచ్చింది. ఇందులో అపరిమిత వీడియో కాల్స్ కూడా అందిస్తోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement