
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు బంపర్ ఆఫర ప్రకటించింది. ఫిపా వరల్డ్ కప్ 2018 నేపథ్యంలో జియోకు పోటీగా సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. స్పెషల్ డేటా ఎస్‌టీవీ రూ.149 కే అందుబాటులోకి వచ్చిన ఈ ప్లాన్‌లో బీఎస్‌ఎన్‌ఎల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు రోజుకు 4 జీబీ మొబైల్ డేటా ఫ్రీ అందిస్తుంది. ముఖ్యంగా ప్రపంచ ఫుట్‌బాల్ ప్రపంచ్ కప్ పోటీ సందడి మొదలైన నేపథ్యంలో క్రీడాభిమానులకోసం ఈ స్పెషల్ ప్యాక్‌ను తీసుకొచ్చింది. ఈ భారీ డేటాతోపాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ కూడా ఈ ప్లాన్‌లో భాగంగా కస్టమర్లకు లభిస్తాయి. జూన్ 14 నుండి జూలై 15వతేదీ ఈ ప్లాన్ (ఫిఫా వరల్డ్ కప్ జరిగే చివరి తేదీ) అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది.
కాగా జియోలో రూ.149 ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుండగా, దీనికి అదనంగా తాజాగా రోజూ మరో 1.5 జీబీ డేటాను జియో ప్రారంభించింది. దీంతో ఈ ప్లాన్‌లో జియో కస్టమర్లకు రోజుకు 3జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ ఆఫర్ చేస్తోంది.