రెండున్నర రూపాయలకే 1జీబీ డేటా | BSNL Announces Data Tsunami Offer | Sakshi
Sakshi News home page

రూ.98కే రోజుకు 1.5జీబీ డేటా

May 18 2018 3:04 PM | Updated on May 18 2018 3:23 PM

BSNL Announceత Data Tsunami Offer - Sakshi

ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్‌, ప్రైవేట్‌ టెల్కోలు రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌కు భలే షాకిచ్చింది. తాజాగా ‘డేటా సునామి’ ఆఫర్‌ ప్రకటించింది. ఈ ఆఫర్‌ కింద 98 రూపాయలకే రోజుకు 1.5 జీబీ డేటాను 26 రోజుల పాటు ఆఫర్‌ చేయనున్నట్టు పేర్కొంది. ఈ కొత్త ఆఫర్‌ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బీఎస్‌ఎన్‌ఎల్‌ సర్కిల్స్‌లో వెంటనే అందుబాటులోకి రానున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఈ కొత్త ప్యాక్‌ను 118 రూపాయల రీఛార్జ్‌ ప్యాక్‌ లాంచ్‌ చేసిన ఒక్కరోజులోనే మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ లాంచ్‌ చేసిన 118 రూపాయల రీఛార్జ్‌ ప్యాక్‌పై అపరిమిత వాయిస్‌ కాల్స్‌, 1 జీబీ డేటా 28 రోజుల పాటు అందుబాటులో ఉండనుంది. కేరళ మినహాయించి బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రస్తుతం అన్ని సర్కిల్స్‌లో 3 జీ స్పీడ్‌ డేటాను అందిస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ కొత్త ప్యాక్‌ కింద ఒక్క జీబీ డేటా ధర 2.51 రూపాయలే. ఇది జియో 149 రూపాయల ప్యాక్‌పై అందించే డేటా రేటు కంటే తక్కువ.

జియో కూడా 149 రూపాయలకు రోజుకు 1.5 జీబీ డేటాను ఆఫర్‌ చేస్తోంది. కానీ జియో ఒక్క జీబీ డేటా ఖరీదు 3.5 రూపాయలు. అదేవిధంగా ఎయిర్‌టెల్‌ కూడా 149 రూపాయల ప్యాక్‌ను తన వినియోగదారులకు ఆఫర్‌ చేస్తోంది. జియో, ఎయిర్‌టెల్‌లు రెండూ వాటి ప్యాక్‌లపై అపరిమిత వాయిస్‌ కాల్స్‌ను, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తుండగా.. బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రం తన 98 రూపాయల ప్యాక్‌పై కేవలం డేటానే ఆఫర్‌ చేస్తోంది. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ తక్కువ రేట్లలో తన సర్వీసులను అందిస్తుందని, ఎకానమిక్‌ రేటులో 1 జీబీ డేటాను రూ.2.51కే తాము ఆఫర్‌ చేయనున్నామని బీఎస్‌ఎన్‌ఎల్‌ బోర్డు ఆర్‌కే మిట్టల్‌ వెల్లడించారు. రిలయన్స్ జియోకు సైతం 98 రూపాయల ప్యాక్‌ను అందిస్తుంది. జియో ఆఫర్‌ చేసే ఈ ప్యాక్‌లో 2 జీబీ డేటా, అపరిమిత వాయిస్‌ కాల్స్‌ ప్రయోజనాలు, 300 ఎస్‌ఎంఎస్‌లను 28 రోజుల పాటు అందనున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement