బీఎండబ్ల్యూ మినిలో 3, 5 డోర్ల వేరియంట్‌లు | BMW launches new Mini Cooper models | Sakshi
Sakshi News home page

బీఎండబ్ల్యూ మినిలో 3, 5 డోర్ల వేరియంట్‌లు

Nov 20 2014 12:31 AM | Updated on Apr 3 2019 4:59 PM

బీఎండబ్ల్యూ మినిలో 3, 5 డోర్ల వేరియంట్‌లు - Sakshi

బీఎండబ్ల్యూ మినిలో 3, 5 డోర్ల వేరియంట్‌లు

బీఎండబ్ల్యూ కంపెనీ మినీ మోడల్‌లో 3, 5 డోర్ల వేరియంట్లను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది.

ముంబై: బీఎండబ్ల్యూ కంపెనీ మినీ మోడల్‌లో 3, 5 డోర్ల వేరియంట్లను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్లలో, 11 రంగుల్లో ఈ కారు లభిస్తుందని  బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ ఫిలిప్ వాన్ సహర్ చెప్పారు. 3 డోర్ల మినీ కారు ధర రూ.31.85 లక్షలు, 5-డోర్ మినీ కారు ధర రూ.35.20 లక్షలని(రెండు ధరలూ ఎక్స్ షోరూమ్) పేర్కొన్నారు.

చిన్న కార్ల సెగ్మెంట్లో ఐదు డోర్ల కారును ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారని పేర్కొన్నారు. ఈ కారు 0-100  కి.మీ. వేగాన్ని 6.7 సెకన్లలో అందుకుంటుందని, గరిష్ట వేగం గంటకు 244 కి.మీ. అని వివరించారు. మూడు డోర్ల మినీ కారు గరిష్ట వేగం గంటకు 200 కి.మీ. అని తెలిపారు.  వచ్చే ఏడాది మిని కూపర్ ఎస్, కూపర్ ఎస్‌డీ వేరియంట్లను అందుబాటులోకి తెస్తామని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement