
చికాగో: ఎవరు ఎన్ని హెచ్చరికలు చేసినా, బిట్‌కాయిన్ జోరు ఏమాత్రం తగ్గడం లేదు. ఆదివారం చికాగో బోర్డ్ ఆప్షన్స్ ఎక్సే్చంజ్(సీబీఓఈ)లో బిట్‌కాయిన్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ ప్రారంభమైంది. ట్రేడింగ్ మొదటిరోజే ఫ్యూచర్స్ మార్కెట్లో బిట్‌కాయిన్ 26 శాతం ఎగిసింది.
వాల్యూమ్స్ డీలర్లను అంచనాలను మించడంతో ట్రేడింగ్‌ను రెండుసార్లు నిలిపేశారు. 15,000 డాలర్ల ధర వద్ద ప్రారంభమైన బిట్‌కాయిన్ జనవరి ఎక్స్‌పైరీ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ట్రేడింగ్ అరంభంలోనే 20 శాతం లాభంతో 18,040 డాలర్లకు చేరింది. ఫిబ్రవరి, మార్చి ఎక్స్‌పైరీ కాంట్రాక్టులు 19 వేల డాలర్లకు కూడా చేరాయి.
బిట్‌కాయిన్ ధర 10 శాతం పెరగగానే రెండు నిమిషాల పాటు ట్రేడింగ్‌ను నిలిపేశారు. మరో 10 శాతం పెరగ్గానే ఐదు నిమిషాల పాటు ట్రేడింగ్‌ను ఆపేశారు. త్వరలో సీఎంఈ గ్రూప్, నాస్‌డాక్ ప్యూచర్లలో కూడా బిట్‌కాయిన్ ట్రేడింగ్ మొదలు కానున్నది. బిట్‌కాయిన్ స్పాట్ ధరలు కూడా పెరిగాయి. 5 శాతం లాభంతో 16,402 డాలర్లకు పెరిగింది.