మహిళలకు బిల్‌గేట్స్‌ వెయ్యి కోట్లు | Bill Melinda Gates Foundation Announces USD 170 mn For Womens Empowerment | Sakshi
Sakshi News home page

మహిళలకు బిల్‌గేట్స్‌ వెయ్యి కోట్లు

Mar 7 2018 11:49 AM | Updated on Mar 7 2018 11:49 AM

Bill Melinda Gates Foundation Announces USD 170 mn For Womens Empowerment - Sakshi

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బిల్‌గేట్స్‌ భారీ విరాళం ప్రకటించారు. మహిళ ఆర్థిక సాధికారిత సాధించడమే లక్ష్యంగా నాలుగు దేశాలకు 170 మిలియన్‌ డాలర్ల(అంటే వెయ్యికిపైగా కోట్ల) ప్రాజెక్ట్‌ను బిల్‌, మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ ప్రకటించింది. ఈ నాలుగు దేశాల్లో భారత్‌ కూడా ఉండటం విశేషం. మంగళవారం బిల్‌, మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ ఈ ప్రకటన చేసింది. ఇండియా, కెన్యా, తంజానియా, ఉగండా దేశాల్లో లింగ సమానత్వం పెరగడం, డిజిటల్ ఆర్ధిక సమ్మేళనం విస్తరించడం, ఉద్యోగ అవకాశాలు పెరగడం, వ్యవసాయ రంగానికి, మహిళల మద్దతు సమూహాలకు మద్దతు ఇవ్వడం వంటి అంశాలను ప్రధాన అంశాలుగా తీసుకుని ఈ ప్రాజెక్ట్‌ను చేప‍ట్టనున్నారు. 

ఒక మహిళ తన జీవితాన్ని తనకు తానుగా మరింత మంచిగా రూపొందించుకోవాలని బిల్‌, మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ కో-చైర్‌ మెలిండా గేట్స్‌ అన్నారు. మహిళల చేతుల్లో మనీ ఉంటే, దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి అనే అంశంపై అవగాహం కలిగి ఉంటారని, దీంతో వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. పురుషుల కంటే మహిళలు తక్కువ అని అనాదిగా వస్తున్న నిబంధనలను వారు మారుస్తారని చెప్పారు. నగదు లేదా మొబైల్‌ మనీ వంటి ఆర్థిక వనరుల విషయంలో మహిళలకు ప్రాధాన్యం కల్పిస్తే, ఆ నిర్ణయాలు ఆమెపై, తన కుటుంబ సభ్యులపై మంచి ప్రభావాన్ని చూపుతాయని, దీని ద్వారా మహిళలు సాధికారిత సాధిస్తారని ఫౌండేషన్‌ చెప్పింది. ఈ పెట్టుబడులు మహిళలు పూర్తిస్థాయిలో ఆర్థికవ్యవస్థలో పాలుపంచుకునే విధంగా సాయం చేయడం మాత్రమే కాకుండా.. ఎన్నో ఏళ్లుగా మహిళలు వెనుకబడి ఉన్న వాటిల్లో అడ్డంకులు తొలగించేలా చేయొచ్చని బిల్‌, మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ జెండర్‌ క్వాలిటీ డైరెక్టర్‌ సరహ హెన్‌డ్రిక్స్‌ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement