పింక్ జెర్సీతో బ‌రిలోకి దిగిన రాజ‌స్తాన్‌.. ఎందుకంటే? | Why is Rajasthan Royals wearing special all-pink jersey during RR vs RCB match? | Sakshi
Sakshi News home page

IPL 2024: పింక్ జెర్సీతో బ‌రిలోకి దిగిన రాజ‌స్తాన్‌.. ఎందుకంటే?

Apr 6 2024 8:15 PM | Updated on Apr 6 2024 8:37 PM

Why is Rajasthan Royals wearing special all-pink jersey during RR vs RCB match? - Sakshi

ఐపీఎల్‌-2024లో భాగంగా జైపూర్‌ వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో​ రాజస్తాన్‌ రాయల్స్‌ పింక్‌ జెర్సీతో బరిలోకి దిగింది. గ్రామీణ మహిళా సాధికారతకు మద్దతు తెలియజేస్తూ ఈ స్పెషల్‌ జెర్సీని రాజస్తాన్‌ ఆటగాళ్లు ధరించారు. సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం పింక్‌ కలర్‌తో నిండిపోయింది.

అదే విధంగా ఈ మ్యాచ్‍ కోసం అమ్ముడైన ఒక్కో టికెట్టుపై రూ.100ను మహిళల వృద్ధికి ఆ ప్రాంచైజీ విరాళంగా ఇవ్వనుంది. అంతేకాకుండా ఈ మ్యాచ్‍లో తమ జట్టు కొట్టే ఒక్కో సిక్సర్‌కు.. రాజస్థాన్‍లోని ఆరు కుటుంబాలకు సొలార్ పవర్‌ను ఆ ఫ్రాంచైజీ అందించనుంది. ఇక ఈ మ్యాచ్‌ విషయానికి వస్తే.. టాస్‌ గెలిచిన రాజస్తాన్‌ రాయల్స్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

తుది జట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్‌), రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్‌ కీపర్‌), సౌరవ్ చౌహాన్, రీస్ టోప్లీ, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కెప్టెన్‌), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, నాండ్రే బర్గర్, యుజ్వేంద్ర చాహల్

Advertisement
 
Advertisement
Advertisement