మిశ్రమంగా వాహన విక్రయాలు | As the mixture of vehicle sales | Sakshi
Sakshi News home page

మిశ్రమంగా వాహన విక్రయాలు

Sep 2 2015 1:12 AM | Updated on Sep 3 2017 8:33 AM

మిశ్రమంగా వాహన విక్రయాలు

మిశ్రమంగా వాహన విక్రయాలు

వాహన విక్రయాలు ఆగస్టు నెలలో మిశ్రమంగా ఉన్నాయి...

- వడ్డీరేట్లు తగ్గుతాయనే అంచనాలతో కొనుగోళ్లు వాయిదా..!
న్యూఢిల్లీ:
వాహన విక్రయాలు ఆగస్టు నెలలో మిశ్రమంగా ఉన్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, ఫోర్డ్ ఇండియా, టయోటా, ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ అమ్మకాలు వృద్ధిని సాధించాయి. టాటా మోటార్స్ విక్రయాలు ఫ్లాట్‌గా ఉన్నాయి. హోండా కార్స్ ఇండియా, మహీంద్రా విక్రయాలు తగ్గాయి. ఈ ఏడాది ఆగస్టు నెల... హ్యుందాయ్ కంపెనీకి అత్యధిక అమ్మకాలు సాధించిన నెలగా నిలిచింది.  ఇక టూవీలర్ల విక్రయాల్లో హోండా, యమహా, రాయల్ ఎన్‌ఫీల్డ్‌లు వృద్ధి సాధించాయి. కొత్త మోడళ్ల కారణంగా అమ్మకాలు పుంజుకున్నాయని పరిశ్రమ వర్గాలంటున్నాయి.

వివరాలు..,
- కొత్త ఎస్‌యూవీ క్రెటా, ఎలీట్ ఐ20, ఐ20 యాక్టివ్ కార్ల జోరుతో హ్యుందాయ్ విక్రయాలు 20 శాతం పెరిగాయి. కంపెనీ చరిత్రలోనే ఇవి అత్యధికం.
- కొత్త మోడళ్ల కారణంగానే అమ్మకాలు పుంజుకున్నాయని టాటా మోటార్స్ ప్రెసిడెంట్(ప్యాసింజర్ వెహికల్ బిజినెస్  యూనిట్) మయాంక్ పరీక్ చెప్పారు.   రానున్న పండుగల సీజన్‌లో అమ్మకాలు పుంజుకోగలవని మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్(ఆటోమోటివ్ డివిజన్) ప్రవీణ్ షా చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement