ఐఫోన్ 7తోనే యాపిల్ వాచ్2 ఎంట్రీ | Apple Watch 2 to Launch Alongside iPhone 7 in September: Report | Sakshi
Sakshi News home page

ఐఫోన్ 7తోనే యాపిల్ వాచ్2 ఎంట్రీ

Jun 16 2016 6:12 PM | Updated on Aug 20 2018 3:07 PM

ప్రపంచంలో అత్యంత ఖరీదైన బ్రాండ్ గా నిలిచిన యాపిల్ తన కొత్త ఐఫోన్ 7తో పాటే, యాపిల్ వాచ్2ను మార్కెట్లోకి తీసుకురావాలని యోచిస్తోందట.

ప్రపంచంలో అత్యంత ఖరీదైన బ్రాండ్ గా నిలిచిన యాపిల్ తన కొత్త ఐఫోన్ 7తో పాటే, యాపిల్ వాచ్2ను మార్కెట్లోకి తీసుకురావాలని యోచిస్తోందట. సెప్టెంబర్ లో ఆవిష్కరించబోతున్న ఐఫోన్ 7తో పాటే దీన్ని తీసుకురాబోతుందని సమాచారం. మూడో త్రైమాసికం లోపల ఈ వాచ్ ల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఇరవై లక్షల యూనిట్లకు పెంచి, వాటి సరుకు రవాణా పెంచనుందని తెలుస్తోంది. రెండోతరం యాపిల్ వాచ్ ల చిప్స్, కాంపొనెంట్లను కూడా మూడో త్రైమాసికంలో ప్రారంభించాలనుకుంటోందని వెల్లడించాయి. ఇకముందు రాబోతున్న యాపిల్ వాచ్ లకు అంచనావేసిన దానికంటే ఎక్కువ డిమాండే ఉండబోతుందని.. అందుకే డిమాండ్ కు అనుగుణంగా  వాటిని అందించాలని యాపిల్ భావిస్తోందట.

అయితే ఇటీవల జరిగిన శాన్ ఫ్రాన్సిస్కో వార్షిక డెవలపర్ల సదస్సు డబ్ల్యూడబ్ల్యూసీలోనే ఈ వాచ్ ను ఆవిష్కరిస్తారని ముందస్తు రిపోర్ట్ లు పేర్కొన్న సంగతి తెలిసిందే. కానీ యాపిల్ వాచ్ 2ను ఈ సదస్సులో యాపిల్ తీసుకురాలేదు. ఐఫోన్ 7తో పాటే యాపిల్ వాచ్ 2ను తీసుకొచ్చేందుకే ఈ ఈవెంట్ లో దీన్ని ఆవిష్కరించలేదని రిపోర్టులు పేర్కొన్నాయి.  ముందస్తు వాచ్ లకంటే యాపిల్ వాచ్ 2 డిజైల్ లో ఎలాంటి మార్పు లేదని, కానీ వాటికంటే 20 నుంచి 40శాతం పలుచగా ఉండబోతున్నాయని రిపోర్టులు నివేదించాయి. బ్యాటరీ సామర్థ్యాన్ని యాపిల్ పెంచిదని తెలిపాయి. సెల్యులార్ కనెక్టివిటీని ఈ వాచ్ సపోర్టు చేస్తుందని తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement