న్యూ లుక్ తో అదరగొట్టనున్న యాపిల్ స్టోర్లు | Apple unveils new store design in San Francisco | Sakshi
Sakshi News home page

న్యూ లుక్ తో అదరగొట్టనున్న యాపిల్ స్టోర్లు

May 20 2016 1:26 PM | Updated on Aug 20 2018 2:55 PM

న్యూ లుక్ తో అదరగొట్టనున్న యాపిల్ స్టోర్లు - Sakshi

న్యూ లుక్ తో అదరగొట్టనున్న యాపిల్ స్టోర్లు

యాపిల్ మరో కొత్త స్టైలిస్ ప్రొడక్ట్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అది అమ్మకానికి కాదంట. తన స్టోర్లకు కొత్త లుక్ ను అద్దడానికి ఆ స్టైలిస్ ప్రొడక్ట్ ను తీసుకొచ్చిందట.

శాన్ ఫ్రాన్సిస్కో :   ఐ ఫోన్  ప్రేమికులను  ఆకట్టుకునే దిశగా యాపిల్  తన  స్టోర్ల కోసం  ఒక కొత్త స్టైలిష్  ప్రొడక్ట్ ను పరిచయం చేస్తోంది.  తన  విక్రయ సంస్థలకు కొత్త రూపును అందించడానికి  ఈ  స్టైలిస్ ప్రొడక్ట్ ను తీసుకొచ్చినట్టు చెబుతోంది.  ప్రపంచవ్యాప్తంగా 480 స్టోర్లు ఉన్న  ఐఫోన్ తయారీదారి యాపిల్, శాన్ ప్రాన్సిస్కో నగరంలోని స్టోర్ ను న్యూ లుక్ అద్దడం కోసమే  ఈ స్టైలిస్ తో రీడిజైన్ చేసిందట.  ఈ రీ డిజైన్ స్టోర్ ను శనివారం నుంచి ప్రజలకు అందుబాటులో తేనున్నట్టు కంపెనీ వెల్లడించింది.  మొత్తం గాజు, మెటల్, చెక్కతో అందంగా దీన్ని  రీ డిజైన్ చేశారట.ఈ ప్రత్యేకతలతోనే భవిష్యత్తులో ప్రారంభించబోయే తమ కొత్త స్టోర్లు కూడా ఉంటాయని యాపిల్ ప్రతినిధులు శాన్ ప్రాన్సిస్కో ఈవెంట్ చెప్పారు. 

కాగా యాపిల్ మొదటిసారి ఐఫోన్ అమ్మకాలను, రెవెన్యూలను కోల్పోయింది. ఈ నేపథ్యంలో తన కొత్తదనంతో మళ్లీ మార్కెట్లను ఆకట్టుకోవాలని యాపిల్ ప్రయత్నిస్తోంది. సిలికాన్ వ్యాలీలో వచ్చే ఏడాది యాపిల్ ప్రారంభించబోయే కొత్త ప్రధాన కార్యాలయాన్ని ఈ ఫీచర్లతోనే రూపొందించనున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement