ఐఫోన్ 6 విక్రయాలకు రెడీ... | Apple to Roll Out iPhone 6 in 36 New Markets by End of October | Sakshi
Sakshi News home page

ఐఫోన్ 6 విక్రయాలకు రెడీ...

Oct 15 2014 12:57 AM | Updated on Aug 20 2018 3:07 PM

ఐఫోన్ 6 విక్రయాలకు రెడీ... - Sakshi

ఐఫోన్ 6 విక్రయాలకు రెడీ...

రెడింగ్టన్ ఇండియా కంపెనీ ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ ఫోన్‌లను ఈ నెల 17 నుంచి అం దించనున్నది. దేశవ్యాప్తంగా 5,000 రిటైల్ అవుట్‌లెట్లలో ఈ ఫోన్లను విక్రయిస్తామని రెడింగ్టన్ ఇండియా తెలిపింది.

గుర్గావ్: రెడింగ్టన్ ఇండియా కంపెనీ ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ ఫోన్‌లను ఈ నెల 17 నుంచి అం దించనున్నది. దేశవ్యాప్తంగా 5,000 రిటైల్ అవుట్‌లెట్లలో ఈ ఫోన్లను విక్రయిస్తామని రెడింగ్టన్ ఇండియా తెలిపింది. ఐఫోన్ 6 ఫోన్‌ల ధరలు రూ.53,500 నుంచి ఐఫోన్ 6 ప్లస్ ఫోన్‌ల ధరలు రూ.62,500 నుంచి ఆరంభమవుతాయని వివరించింది. 

అత్యంత ఆధునికమైన ఫీచర్లతో యాపిల్ కంపెనీ ఈ ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్‌లను రూపొందించిందని పేర్కొంది. వినూత్నమైన ఫీచర్లతో చేతిలో సులభంగా ఇమిడిపోయేలా, సుల భంగా వినియోగించేలా ఈ ఫోన్‌లను యాపిల్ కంపెనీ తయారు చేసిందని తెలిపింది. ఐఓఎస్ 8 పై పనిచేసే ఈ  ఫోన్‌లలో రెటినా హెచ్‌డీ డిస్‌ప్లే, ఏ8 చిప్, ఆడ్వాన్స్‌డ్ ఐసైట్, ఫేస్‌టైమ్ హెచ్‌డీ కెమెరా, ఆల్ట్రాఫాస్ట్ వెర్లైస్ టెక్నాలజీస్ వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొంది. యాపిల్ క్విక్‌టైప్ కీబోర్డ్, ఐక్లౌడ్ డ్రైవ్, కొత్త హెల్త్ యాప్ వంటి ఆకర్షణీయ ఫీచర్లు కూడా ఉన్నాయని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement