అద్భుతం : మనకీ ధైర్యం పెరుగుతుంది

Anand Mahindra lauds centre decision on local shops - Sakshi

 సాన్థిక దుకాణాలే సమాజానికి వెన్నెముకలాంటివి -ఆనంద్ మహీంద్ర

లాక్ డౌన్ ఆర్థికంగా బాగా దెబ్బతిన్న వారి మనోస్థైర్యం పెరుగుతుంది 

సాక్షి, ముంబై : లాక్‌డౌన్ ఆంక్షలను కొంతమేర సడలిస్తూ కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎం అండ్ ఎం అధినేత ఆనంద్ మహీంద్ర ప్రశంసించారు. ముఖ్యంగా నివాస ప్రాంతాల్లో స్థానిక దుకాణాలను తిరిగి తెరవడం వారి మనుగడ అవకాశాలను మెరుగుపరుస్తుందనీ ఇది ప్రజల మనోస్థైర్యాన్ని పెంచుతుందనీ  శనివారం ఆయన ట్వీట్ చేశారు.  ఈ నిర్ణయం అద్భుతమైందనీ, స్థానిక వ్యాపారాలే సమాజానికి వెన్నుముక లాంటివని  పేర్కొన్నారు. లాక్‌డౌన్ కారణంగా వ్యాపారాలు నిలిచిపోవడంతో ఆర్థికంగా స్థానిక దుకాణాదారులే బాగా ఒత్తిడిని ఎదుర్కొన్నారన్నారు. తాజా నిర్ణయంతో షాపులు తిరిగి తెరుచుకుని ఆర్థికంగా తెప్పరిల్లే అవకాశం వారికి కలుగుతుందన్నారు. మన ధైర్యాన్ని కూడా పెంచుతుందనీ,  అలాగే వారికి  హోం డెలివరీ చేసే అవకాశం కూడా లభిస్తుందని ఆశిస్తున్నానని ట్వీట్ చేశారు. (ఇ-కామర్స్‌ కంపెనీలకు మరో షాక్)

కోవిడ్-19  ను అరికట్టడానికి  దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన నెల రోజుల తరువాత హాట్‌స్పాట్‌లు లేదా కంటైన్మెంట్ ప్రాంతాలను మినహాయించి, స్థానిక వ్యాపారులకు పెద్ద ఉపశమనం కలిగిస్తూ కేంద్రం శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది. నివాస సముదాయాలు, పరిసరాల్లోని దుకాణాలతో సహా  షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం ప్రకారం రిజిస్టర్ అయిన షాపులు మాత్రమే తెరవాలని తెలిపింది.  అయితే  ఈ సడలింపులు, కరోనావైరస్ హాట్‌స్పాట్‌లు లేదా కంటైన్మెంట్ జోన్‌లకు వర్తించవని స్పష్టం చేసింది. అయితే ఆయా దుకాణాల్లోని కార్మికులకు మాస్క్ లు, సామాజిక దూర నిబంధనలు తప్పనిసరి అని హోం మంత్రిత్వ శాఖ స్పష్టంగా పేర్కొంది. మరోవైపు కరోనా వైరస్ కట్టడిలో భాగంగా లాక్‌డౌన్ .2 మే 3వ తేదీవరకు పొడిగించిన గతి తెలిసిందే.  (5 సెకన్లలో కరోనా వైర‌స్‌ను గుర్తించవచ్చు!)

చదవండి : ప్రపంచంలోనే టాప్ సుందర్ పిచాయ్

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top