ప్రపంచంలోనే టాప్ సుందర్ పిచాయ్

 Alphabet CEO Sundar Pichai one of world highes tpaid execs worth usd 281 million - Sakshi

ప్రపంచంలోనే  అత్యధిక  వేతనం  పొందిన సీఈవోగా  సుందర్ పిచాయ్

అల్ఫాబెట్ ఉద్యోగుల సగటు వేతనానికి 1,085 రెట్లు  అధికం

సాక్షి, న్యూడిల్లీ:  అల్ఫాబెట్, గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) సుందర్ పిచాయ్  (47) మరోసారి రికార్డుల కెక్కారు. ప్రపంచంలోనే అత్యధిక జీతం తీసుకుంటున్న టాప్ అధికారిగా నిలిచారు. సుందర్ పిచాయ్‌కు గత ఏడాది 281 మిలియన డాలర్ల ( రూ. 21,44,53,58,000)  వేతనం లభించిందని, దీంతో ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకునే ఎగ్జిక్యూటివ్లల ఒకరుగా నిలిచారని  గూగుల్  మాతృ సంస్థ అల్ఫాబెట్  శుక్రవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది  అల్ఫా బెట్ ఉద్యోగుల సగటు వేతనానికి 1,085 రెట్లు అని కంపెనీ  తెలిపింది. ప్యాకేజీలో ఎక్కువ భాగం స్టాక్ అవార్డులు, వీటిలో కొన్ని ఎస్  అండ్ పీ 100 సూచికలోని ఇతర కంపెనీలతో పోలిస్తే ఆల్ఫాబెట్  స్టాక్ రిటర్న్ ఆధారంగా చెల్లించనున్నామని తెలిపింది.  

2015 సంవత్సరం నుంచి గూగుల్ కంపెనీకి సీఈవోగా ఉన్న సుందర్ పిచాయ్ గత  ఏడాది చివర్లో  ఆల్ఫాబెట్‌ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్‌ సంస్థ నుండి వైదొలగడంతో  అల్ఫాబెట్‌కు  సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. సంవత్సరానికి వేతనం దాదాపుగా 2 మిలియన్ డాలర్లకు పెరిగింది. భారతీయ సంతతికి చెందిన టెక్ దిగ్గజం గతంలో  కూడా భారీ ప్యాకేజీలను సొంతం చేసుకున్నారు. సుందర్ 2016 లో 200 మిలియన్ డాలర్లను స్టాక్ అవార్డు రూపంలో పొందారు. 2018లో మొత్తం వేతనం 1.9 మిలియన్ డాలర్లు. చెన్నై అతి సాధారణమైన కుటుంబం నుంచి వెళ్లి అత్యధిక జీతంతో పాటు గొప్ప పేరుని సంపాదించుకున్న సుందర్ పిచాయ్ ప్రపంచం టెక్ దిగ్గజంగా నిలిచిన  సంగతి తెలిసిందే. (మరోసారి పెద్ద మనసు చాటుకున్న సుందర్ పిచాయ్)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top