రూ.499కే అమెజాన్‌ ప్రైమ్‌

Amazon Prime Announce Youth Offer - Sakshi

న్యూఢిల్లీ : అమెజాన్‌ ప్రైమ్‌ యువతకు బంపరాఫర్‌ ప్రకటించింది. ఏడాది 999 రూపాయలతో పొందాల్సిన అమెజాన్‌ ప్రైమ్‌ను, యువతకు కేవలం 499 రూపాయలకు ఆఫర్‌ చేస్తోంది. దీంతో అపరిమిత వీడియో స్ట్రీమింగ్‌, ఫాస్ట్‌ డెలివరీ, యాడ్‌-ఫ్రీ మ్యూజిక్‌ అన్నీ కూడా ఇక 50 శాతం తగ్గింపుతో లభ్యం కానున్నాయి. అయితే ఇది కేవలం 18 నుంచి 24 ఏళ్ల మధ్యలో వయసు ఉన్న వొడాఫోన్‌ ప్రీపెయిడ్‌ కస్టమర్లకు మాత్రమే. దీని కోసం మైవొడాఫోన్‌ యాప్‌ లేటెస్ట్‌ వెర్షన్‌ను డౌన్‌లోడ్‌ లేదా అప్‌డేట్‌ చేసుకోవాలని అమెజాన్‌ తెలిపింది. 

ఆ అనంతరం ‘గ్రాబ్‌ ఇట్‌’ లేదా ‘గెట్‌ ఇట్‌ నౌ’ అనే దానిపై క్లిక్‌ చేయాలి. ఈ మెసేజ్‌ కేవలం అర్హత కలిగిన కస్టమర్లకు మాత్రమే కనిపిస్తుంది. ఆ తర్వాత ‘అగ్రి అండ్‌ పే ఐఎన్‌ఆర్‌ 499 నౌ’ పై క్లిక్‌ చేయాలి. మీరు ఎంచుకున్న పేమెంట్‌ విధానంలో రూ.499లో చెల్లించి, ‘యాక్టివ్‌ నౌ’ను క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత వచ్చే స్క్రీన్‌ ద్వారా అమెజాన్‌.ఇన్‌లోకి సైన్‌-ఇన్‌ అవ్వాలి. ఈ ప్రక్రియలన్నీ ముగిశాక, మీ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ యాక్టివేట్‌ అవుతుంది. దీంతో మీరు అమెజాన్‌ ప్రైమ్‌ కింద ఆఫర్‌ చేసే అన్ని ప్రయోజనాలను ఎంజాయ్‌ చేసుకోవచ్చు. కాగ, కొన్ని రోజుల క్రితమే వొడాఫోన్‌ పోస్టు పెయిడ్‌ కస్టమర్లకు అమెజాన్‌ ప్రీమియం వీడియో ఆఫర్‌ను ఏడాదిపాటు ఉచితంగా ఆఫర్‌ చేయనున్నట్టు ప్రకటించింది. వోడాఫోన్‌ ప్లే యాప్‌ ద్వారా  ఈ ఆఫర్‌ను అందిస్తోంది. తాజాగా కస్టమర్లను ముఖ్యంగా యువతను ఎక్కువగా ఆకట్టుకోవడానికి అమెజాన్‌, వొడాఫోన్‌ ప్రీపెయిడ్‌ కస్టమర్లకు కూడా అమెజాన్‌ ప్రైమ్‌ను తక్కువ ధరకు అందుబాటులోకి తెచ్చింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top