ట్రయంఫ్ థ్రక్స్‌టన్ ఆర్ @10.90 లక్షలు | All-new 2016 Triumph Thruxton R to be launched In India today | Sakshi
Sakshi News home page

ట్రయంఫ్ థ్రక్స్‌టన్ ఆర్ @10.90 లక్షలు

Jun 4 2016 12:25 AM | Updated on Sep 4 2017 1:35 AM

ట్రయంఫ్ థ్రక్స్‌టన్ ఆర్ @10.90 లక్షలు

ట్రయంఫ్ థ్రక్స్‌టన్ ఆర్ @10.90 లక్షలు

ఖరీదైన బైక్‌ల తయారీ దిగ్గజం ట్రయంఫ్ తాజాగా బోనెవిల్లే థ్రక్స్‌టన్ ఆర్ మోడల్‌ను భారత మార్కెట్లో శుక్రవారం విడుదల చేసింది.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఖరీదైన బైక్‌ల తయారీ దిగ్గజం ట్రయంఫ్ తాజాగా బోనెవిల్లే థ్రక్స్‌టన్ ఆర్ మోడల్‌ను భారత మార్కెట్లో శుక్రవారం విడుదల చేసింది. 1,200 సీసీ, హై పవర్, 8 వాల్వ్, ప్యారలల్ ట్విన్ ఇంజన్, ఆరు గేర్లు, ఏబీఎస్, అడ్జెస్టబుల్ సస్పెన్షన్ వంటి ఫీచర్లున్నాయి. ఇంధనం, శక్తి నియంత్రణకు ట్రయంఫ్ తదుపరి తరం ఎలక్ట్రానిక్ రైడ్ బై వైర్ సిస్టమ్‌ను వాడారు. మొత్తంగా మోడర్న్ క్లాసిక్ స్పోర్ట్స్ స్టైల్‌తో వాహనాన్ని రూపొందించారు.

కంపెనీకి చెందిన కొత్త బోనెవిల్లే ఫ్యామిలీ నుంచి ఇది మూడవ బైక్ కావడం విశేషం. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో బైక్ ధర రూ.10.90 లక్షలు. ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ ఇండియా ప్రస్తుతం 15 మోడళ్లను దేశీయంగా విక్రయిస్తోంది. భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ రెండేళ్లలో 3,000లకు పైగా బైక్‌లను అమ్మింది. హైదరాబాద్‌తోసహా దేశవ్యాప్తంగా 12 డీలర్‌షిప్ కేంద్రాలను నిర్వహిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement