కొత్త బైక్స్.. కేవలం రూ.4,999తో బుకింగ్‌! | Triumph Bonneville T40 Bookings Open At Rs 4999 | Sakshi
Sakshi News home page

కొత్త బైక్స్.. కేవలం రూ.4,999తో బుకింగ్‌!

Oct 10 2026 9:07 PM | Updated on Oct 10 2026 9:09 PM

Triumph Bonneville T40 Bookings Open At Rs 4999

ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ ఇండియా.. తన కొత్త బోన్నెవిల్ టీ40, టీ4 బైక్‌ల కోసం బుకింగ్స్‌ను ప్రారంభించింది. ఈ రెండు బైక్‌లు పాతకాలపు క్లాసిక్ లుక్‌తో పాటు ఆధునిక ఫీచర్లను కలిగి ఉన్నాయి. వీటిలో బోన్నెవిల్ టీ4 ధర రూ. 2.55 లక్షలు కాగా, బోన్నెవిల్ టీ40 ధర రూ. 2.80 లక్షలు (ఎక్స్‌షోరూమ్). ఈ రెండు బైక్‌లను ట్రయంఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో రూ. 4,999 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

ఈ కొత్త ట్రయంఫ్ బైక్‌లలో 350 సీసీ, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజిన్‌లో కొన్ని మార్పులు చేయడంతో పాటు, ఛాసిస్, సస్పెన్షన్, ఇతర ఫీచర్లలో కూడా ప్రత్యేకమైన మార్పులు చేశారు. ముఖ్యంగా.. పాతకాలపు బైక్‌లను ఇష్టపడేవారికి వీటి డిజైన్ బాగా నచ్చే అవకాశం ఉంది. క్లాసిక్ లుక్‌తో పాటు ఆధునిక ఇంజిన్ టెక్నాలజీని అందించడం ఈ బైక్‌ల ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

భారత మార్కెట్‌లో ఈ కొత్త బోన్నెవిల్ బైక్‌లకు రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, హోండా సీబీ350సీ, జావా 350, యెజ్డీ రోడ్‌స్టర్ వంటి బైక్‌ల నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే.. ఈ ప్రత్యర్థి బైక్‌లతో పోలిస్తే ట్రయంఫ్ బోన్నెవిల్ టీ4, టీ40 ధరలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ.. ప్రత్యేకమైన డిజైన్, బ్రాండ్ విలువ, ఇంజిన్ పనితీరుతో కస్టమర్లను ఆకట్టుకోవాలని ట్రయంఫ్ భావిస్తోంది.

ఇదీ చదవండి: చాట్‌జీపీటీ సాయం.. సివిల్ సర్వీసెస్‌లో విజయం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement