ఎయిర్‌టెల్‌  ‘భరోసా’: ఐదు లక్షల ఉచిత బీమా

Airtel Payments Bank unveils Bharosa with free insurance cover - Sakshi

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ‘భరోసా సేవింగ్స్ అకౌంట్’

రూ. 500 కనీస నిల్వ, రూ. ఐదు లక్షల ఉచిత యాక్సిడెంట్ కవర్‌

సాక్షి,  హైదరాబాద్ : ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ తన వినియోగదారుల కోసం ఒక సరికొత్త ఆవిష్కరణను తీసుకొచ్చింది.  ‘భరోసా సేవింగ్స్ అకౌంట్‌’ పేరుతో కొత్త  సేవను నేడు (మంగళవారం) ప్రారంభించింది. ఇది అండర్‌ బ్యాంక్ , అన్‌బ్యాంక్ కస్టమర్ల ప్రత్యేకమైన అవసరాలను తీర్చనుందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.  కేవలం నెలవారీ బాలెన్స్‌ 500 రూపాయలతో ఈ ఖాతాను నిర్వహిండచడంతోపాటు,  ఐదు లక్షల రూపాయల వ్యక్తిగత ప్రమాద బీమాను ఉచితంగా అందిస్తున్నట్టు తెలిపింది.  ఈ ఖాతా ద్వారా సౌకర్యవంతమైన బ్యాంకింగ్ సేవలను అందించడంతో పాటు, నెలకు ఒక లావాదేవీ ఉచితం. అలాగే   భరోసా ఖాతా ద్వారా ప్రభుత్వ రాయితీలు పొందే  లేదా,  నగదు డిపాజిట్లు చేసే వినియోగదారులు క్యాష్‌బ్యాక్‌ కూడా  సదుపాయాన్ని  కూడా పొందవచ్చు. 
  
భరోసా సేవింగ్స్‌ అకౌంట్‌ను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందనీ, ఈ వినూత్న ఖాతాతో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ వినియోగం, లావాదేవీల అధికారిక బ్యాంకింగ్ విధానాన్ని  సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్   సీఎండీ  అనుబ్రాతా బిస్వాస్  తెలిపారు.  ఇది ఆర్థికంగా వెనుకబడిన వారి అవసరాలను తీర్చడానికి రూపొందించబడిన వినూత్నమైన, విభిన్నమైన పథకమని పేర్కొన్నారు. భరోసా సేవింగ్స్ ఖాతా కస్టమర్లు భారతదేశం అంతటా 6,50,000 ఆధార్‌ ఎనేబుల్డ్  పేమెంట్‌ సిస్టం అవులెట్లలో నగదు ఉపసంహరించుకోవచ్చు, బ్యాలెన్స్ తనిఖీ చేసుకోవచ్చు. మినీ స్టేట్‌మెంట్‌ను కూడా  తీసుకోవచ్చు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top