breaking news
New Account
-
ఎయిర్టెల్ ‘భరోసా’: 5 లక్షల ఇన్సూరెన్స్ ఫ్రీ
సాక్షి, హైదరాబాద్ : ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ తన వినియోగదారుల కోసం ఒక సరికొత్త ఆవిష్కరణను తీసుకొచ్చింది. ‘భరోసా సేవింగ్స్ అకౌంట్’ పేరుతో కొత్త సేవను నేడు (మంగళవారం) ప్రారంభించింది. ఇది అండర్ బ్యాంక్ , అన్‌బ్యాంక్ కస్టమర్ల ప్రత్యేకమైన అవసరాలను తీర్చనుందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. కేవలం నెలవారీ బాలెన్స్ 500 రూపాయలతో ఈ ఖాతాను నిర్వహిండచడంతోపాటు, ఐదు లక్షల రూపాయల వ్యక్తిగత ప్రమాద బీమాను ఉచితంగా అందిస్తున్నట్టు తెలిపింది. ఈ ఖాతా ద్వారా సౌకర్యవంతమైన బ్యాంకింగ్ సేవలను అందించడంతో పాటు, నెలకు ఒక లావాదేవీ ఉచితం. అలాగే భరోసా ఖాతా ద్వారా ప్రభుత్వ రాయితీలు పొందే లేదా, నగదు డిపాజిట్లు చేసే వినియోగదారులు క్యాష్‌బ్యాక్ కూడా సదుపాయాన్ని కూడా పొందవచ్చు. భరోసా సేవింగ్స్ అకౌంట్‌ను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందనీ, ఈ వినూత్న ఖాతాతో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ వినియోగం, లావాదేవీల అధికారిక బ్యాంకింగ్ విధానాన్ని సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సీఎండీ అనుబ్రాతా బిస్వాస్ తెలిపారు. ఇది ఆర్థికంగా వెనుకబడిన వారి అవసరాలను తీర్చడానికి రూపొందించబడిన వినూత్నమైన, విభిన్నమైన పథకమని పేర్కొన్నారు. భరోసా సేవింగ్స్ ఖాతా కస్టమర్లు భారతదేశం అంతటా 6,50,000 ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం అవులెట్లలో నగదు ఉపసంహరించుకోవచ్చు, బ్యాలెన్స్ తనిఖీ చేసుకోవచ్చు. మినీ స్టేట్మెంట్ను కూడా తీసుకోవచ్చు -
ట్విట్టర్లోకి కొత్త ఖాతాతో మళ్లీ వచ్చారు
ముంబయి: ప్రముఖ బాలీవుడ్ సింగర్ అభిజీత్ భట్టాచార్య తిరిగి ట్విటర్‌లోకి వచ్చారు. ఆయన ఖాతాను ట్విటర్ సంస్థ సస్పెండ్ చేసి వారం రోజులు అవుతుండగా ఆయన కొత్త ఖాతాతో తిరిగి అడుగుపెట్టారు. ఓ వీడియోతో ఆయన తన ట్విటర్ అభిమానుల్ని పలకరించారు. నేరపూరితమైన ముఖ్యంగా మహిళలను కించపరిచేలాగా అభిజీత్ ట్విట్టర్లో పోస్ట్‌లు చేస్తుండటంతో ఆయన ఖాతాను ట్విటర్ యాజమాన్యం రద్దు చేసింది. దీంతో జాతి వ్యతిరేకులపై తన గొంతు ఎప్పటికీ అపలేరు అంటూ తాజా వీడియోతో కొత్త ఖాతా ద్వారా ఆయన ట్విటర్‌లోకి సోమవారం ప్రవేశించారు. ‘ఇది నా కొత్త ట్విటర్ ఖాతా. ఇప్పటి వరకు కూడా నా వెరిఫైడ్ ఖాతా ఇంకా యాక్టివ్ అవ్వలేదు.. దయచేసి నన్ను ఈ ఖాతాలో ఫాలో అవండి. నా పేరుతో ఉన్న ఇతర ఖాతాలన్నీ కూడా ఫేక్. నా పేరును చెడగొట్టాలనే కొందరు వాటిని ఉపయోగిస్తున్నారు’ అంటూ ట్వీట్ చేసిన తొలి వీడియోలో అభిజీత్ పేర్కొన్నారు. అంతేకాదు యాష్ ట్యాగ్‌తో వందే మాతరం.. ఐయామ్ బ్యాక్ అంటూ జాతి వ్యతిరేక శక్తులు నా గొంతును ఆపలేరు.. భారత ఆర్మీకి నా వందనం అని పేర్కొన్నారు.