ఒక్కరోజులోనే ఎయిర్‌టెల్‌ మరో కొత్త ఆఫర్‌ | Airtel Offers 3GB Data Per Day at Rs. 799 to Prepaid Customers | Sakshi
Sakshi News home page

ఒక్కరోజులోనే ఎయిర్‌టెల్‌ మరో కొత్త ఆఫర్‌

Oct 4 2017 4:22 PM | Updated on Oct 4 2017 7:31 PM

Airtel Offers 3GB Data Per Day at Rs. 799 to Prepaid Customers

సాక్షి, న్యూఢిల్లీ :  రిలయెన్స్ జియోకి పోటీగా టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ రోజుకో కొత్త ప్లాన్‌ను ప్రకటిస్తూనే ఉంది. నిన్ననే జియోకు పోటీగా కొత్తగా రూ.999 ప్లాన్‌ను ప్రకటించిన ఎయిర్‌టెల్‌, నేడు మరో కొత్త ఆఫర్‌ను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. జియో కొత్త ఐఫోన్లపై ప్రకటించిన ఎక్స్‌క్లూజివ్‌ ప్లాన్‌ మాదిరి, తన ప్రీపెయిడ్‌ కస్టమర్లకు ఎయిర్‌టెల్‌ కొత్తగా రూ.799 ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని కింద రోజుకు 3జీబీ డేటాతో పాటు అపరిమితి లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌ను ఆఫర్‌ చేయనున్నట్టు తెలిపింది. ఈ ప్లాన్‌ 28 రోజుల పాటు వాలిడ్‌లో ఉంటుంది. అంటే 28 రోజులకు గాను, రోజుకు 3జీబీ డేటా చొప్పున 84జీబీ డేటాను వినియోగదారులు పొందవచ్చు. ఇది కేవలం ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ కస్టమర్లకు మాత్రమే. ఈ ప్లాన్‌ జియో రూ.799 ప్యాక్‌కు గట్టి పోటీగా ఉంది.  

ఇక ఇతర ప్లాన్లపై ఎయిర్‌టెల్‌ అన్‌లిమిటెడ్ కాల్స్‌ను రోజుకు 250 నిమిషాలకు, వారానికి వెయ్యి నిమిషాలకు పరిమితం చేసింది. ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంకు ద్వారా కొత్త ఎయిర్‌టెల్‌ ప్లాన్‌ను కొనుగోలు చేస్తే రూ.75 క్యాష్‌బ్యాక్‌ను కూడా ఎయిర్‌టెల్‌ అందించనుంది. ప్రస్తుతం ఎయిర్‌టెల్‌ కొత్త ప్లాన్లు రూ.549 నుంచి రూ.999 మధ్యలో ఉన్నాయి. వీటికి రోజుకు 2జీబీ డేటా, 4జీబీ డేటాను ఎయిర్‌టెల్‌ అందిస్తోంది. ఈ రెండు ప్లాన్లకు అపరిమిత లోకల్‌, ఎస్డీడీ కాల్స్‌ను ఎయిర్‌టెల్‌ ఆఫర్‌ చేస్తోంది. రోజుకు 3జీబీని ఆఫర్‌ చేసిన తొలి టెలికాం ఆపరేటర్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌. బీఎస్‌ఎన్‌ఎల్‌ కంపెనీ తన ట్రిపుల్‌ ఏస్‌ ప్లాన్‌ కింద రోజుకు 3జీబీ డేటాను అందించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement